‘ కల్కి ‘ ట్రైలర్ పై ఫ‌జిల్ సంధించిన ఆర్జీవి.. త్వరపడితే లక్ష గెలవచ్చంటూ..?!

పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులంతా మోస్ట్ అవైటెడ్‌గా ఎదురుచూస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో పాన్‌ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. అమితాబచ్చన్, కమలహాసన్, దీపిక పదుకొనే, దిశాపటాని లాంటి స్టార్ సెలబ్రెటీస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఇండియన్ మైథాలజీ కాన్సెప్ట్‌తో స్కైప్పై మూవీ గా ఈ మూవీ తెర‌కెక్కుతుంది.

Kalki 2898 AD : కల్కి ట్రైలర్ పై ఆర్జీవి పజిల్.. కనిపెడితే లక్ష ఇస్తానంటూ బంపర్ ఆఫర్..? - NTV Telugu

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ కూడా వేరే లెవెల్‌లో ఉండడంతో సినిమాపై హైప్ మరింతగా పెరిగింది. ఇక ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అద్భుతమైన విజువల్స్ తో వచ్చిన ఈ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే నెటింట విద్వంసం సృష్టించింది.

ఈ ట్రైలర్లో విజువల్స్ తో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి కల్కి ట్రైలర్ పై ఆడియన్స్ కు పజిల్ సందించాడు. తన సోషల్ మీడియా వేదికగా కల్కి సినిమా గురించి ఫిలిందా బ్లాంక్ టైప్ సెంటెన్స్ ను రాసి దాన్ని ఎవరైతే ముందుగా పూర్తి చేస్తారో వాళ్లకి లక్ష రూపాయలు బహుమతి ఇస్తా అంటూ వివరించాడు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ పోస్ట్ నెటింట‌ వైరల్‌గా మారింది.