“నీ పతనం మొదలైంది అల్లు అర్జున్ గుర్తు పెట్టుకో”..అంత మాట అనేశావు ఏంటి బ్రో..?

కిరాక్ ఆర్పీ.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా బాగా వినిపిస్తున్న పేరు.. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. చాలా షోస్ కూడా చేశాడు.. పలు ఈవెంట్స్ లో కూడా మెరిశారు. అంతేకాదు బడాబడా టాప్ సెలబ్రిటీలతో పరిచయాలు కూడా ఉన్నాయి . మరి ముఖ్యంగా నాగబాబుకి రైట్ హ్యాండ్ అన్న పేరు కూడా ఉంది . ఈ మధ్యకాలంలో కిర్రాక్ ఆర్పి ..వైసిపి మాజీ మినిస్టర్ రోజాపై అదేవిధంగా అల్లు అర్జున్ పై ఎలా మండిపడ్డాడో మనం చూసాం.

మరీ ముఖ్యంగా రోజాపై అయితే చాలా చాలా ఘాటుగా స్పందించారు . ఇప్పుడు అల్లు అర్జున్ పై కూడా అదే విధంగా స్పందిస్తున్నాడు కిర్రాక్ ఆర్పి . అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేయడం కిరాక్ ఆర్పీ కి అస్సలు నచ్చలేదు. దీంతో ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయారు . “మీకు మీకు ఉంటే ఏమైనా చూసుకోండి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వచ్చిన వాడికి ఎలా సపోర్ట్ చేస్తాడు..?” అంటూ కూసింత హై టోన్ పిచ్ లో మండిపడ్డాడు . అక్కడే అల్లు అర్జున్ అభిమానులకు కాలిపోయింది . దీంతో ఆయన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఆఫ్పీసెస్ షాప్స్ పై దాడి చేశారు. అయితే తాజాగా దీని పై ఆయన స్పందించాడు . అంతేకాదు మరొకసారి అల్లు అర్జున్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

“అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంట్లో ఆడవాళ్ళ మీద కూడా దాడులకు తెగబడుతున్నారు. ఇది చాలా దారుణం.. గతంలో జరిగిన విషయాలు గుర్తుపెట్టుకో..అలా చేసిన ప్రభుత్వం కూలిపోయింది. నువ్వు కూడా అదే చేస్తున్నావు. నీకు పతనం మొదలైంది. నువ్వు అల్లు అర్జున్ అయితే నేను కిరాక్ ఆర్పీ. అంతే నీకు నాకు తేడా..? నేను ఎవడికీ భయపడను. నీకు ఆర్మీ ఉందో లేదో నాకు తెలియదు. ఆర్మీ అంటే నీది కాదు. జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు నిజమైన ఆర్మీ. నువ్వు హీరోగా ఎదుగు సంతోషిస్తాము. సపోర్ట్ చేశాము.. అంతే కానీ ఇలాంటి చర్యలు మానుకో” అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.