ప్రభాస్ పై ప్రశంసలు వర్షం కురిపించిన రజనీకాంత్.. పోస్ట్ వైరల్..?!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో రజినీకాంత్ అభిమానిగా కనిపించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాల్లో తన నటన‌కు మంచి మార్కులు కూడా పడ్డాయి. అయితే అప్పుడు ప్రభాస్.. రజిని అభిమానిగా కనిపించాడు. కానీ ఇప్పుడు కల్కి సినిమాతో ప్రభాస్ రజనీకాంత్ తోనే స్వయంగా ప్రశంసలు అందుకునే రేంజ్ కు ఎదిగాడు. ఈ క్ర‌మంలో స్టార్ హీరో ప్రభాస్ సక్సెస్ స్టోరీ చూస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభాస్ రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కల్కి సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు ఎదురుచూస్తున్న నాగ్‌ అశ్విన్.. ఇండియన్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకువెళ్ళాడు అంటూ.. రజనీకాంత్ కల్కి సినిమా పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కల్కి మూవీలో నటించిన వారికి ఈ సినిమా కోసం పనిచేసిన వారికి నా శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చాడు. కల్కి సీక్వెల్ కోసం ఆయన ఎదురుచూస్తున్న అంటూ చెప్పిన విషయాలు ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. రజినీకాంత్ లాంటి వ్యక్తితో ప్రభాస్ సినిమా ప్రశంసలు పొందడం అంటే సాధారణ విషయం కాదు అంటూ కొందరు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Kalki 2898 AD story explained without spoilers with Prabhas, Amitabh Bachchan, Deepika Padukone - India Today

మరో స్టార్ హీరో నాగార్జున కూడా కల్కి మూవీ పై పాజిటీవ్‌ రివ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. క‌ల్కి సినిమాకు అమితాబ్ అస‌లుసిసలైన మాస్ హీరో అని నాగార్జున చెప్పుకొచ్చాడు. ఆయన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు అని నాగార్జున వివరించాడు. కల్కి సీక్వెల్లో కమ్మల్‌ను చూడడం కోసం వేచి చూస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ నువ్వు మరోసారి ని సత్తా చాటావు అంటూ నాగార్జున వెల్లడించాడు. దీపికా పదుకొనే చాలా అద్భుతంగా నటించిందని.. మీరంతా కలిసి ఇండియన్ సినిమా స్థాయిని మరో లెవెల్ కు తీసుకెళ్లారు అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రజనీకాంత్, నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో ప్రభాస్ అభిమానులు ఆనందానికి వ్యక్తం చేస్తున్నారు.