పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ గతేడాదీ చివరిలో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ కల్కి 2898ఏడీ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. నాగ్ అశ్విన్ లాంటి టాలెంటెడ్ దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇలాంటి జానర్‌లో ఓ సినిమా రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అది కూడా మహానటి ఫేమ్ నాగ అశ్విన్ లాంటి డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో అభిమానుల్లో మరింత హైప్ పెరిగింది.
ఇప్పటికే సినిమా నుంచి గ్లింప్స్ రిలీజై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రభాస్ సినిమాలో భైరవ్ పాత్రలో కనిపించనున్నాడు. అమితాబచ్చన్, దీపిక పదుకొనే, దిశపఠాని, కమల్‌హాసన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక బుజ్జిని కూడా తాజాగా పరిచయం చేసిన సంగతి తెలిసింది. బుజ్జి, భైరవ మధ్య ఎలాంటి బాండింగ్ ఉండబోతుందో తెలిపే చిన్న ప్రయత్నం చేశారు. తాజాగా బుజ్జి తోనే ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై హైపట్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా తాజాగా కల్కి 2898 ఏడీ యానిమేషన్ సిరీస్ భైరవ అండ్ బుజ్జి కూడా రిలీజ్ చేయగా దీనిపై మంచి స్పందన వచ్చింది.
ఈ క్రమంలో సినిమా రన్ టైమ్ ఎంత అనే అంశం వైరల్ గా మారింది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయని.. ఇందులో భాగంగా రన్ టైం బయటకు రివిల్ అయినట్లు సమాచారం. రెండు గంటల 49 నిమిషాల నడివితో ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఇక ఇటీవల పాన్ ఇండియా లెవెల్లో సినిమాల అనిట్టికంటే చాలా డీసెంట్ రన్ టైం అని చెప్పవచ్చు. ఇక ఇటీవల పాన్ ఇండియా సినిమాలు పెద్ద హీరోల సినిమాలు ఏవి మూడు గంటలు లోపు ఆడిన పరిస్థితి లేదు. పుష్ప నుంచి ఈ ట్రెండ్ మొదలైంది. అనిమల్ ఏకంగా మూడున్నర గంటలు నడివితో కొనసాగింది. దీంతో కల్కి సినిమా రన్ టైమ్ మరీ తక్కువగా ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.