సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి ..కొందరు ఇలానే ముందుకు వెళ్లాలి అని అనుకుంటూ ఉంటారు ..మరికొందరు ట్రెండ్ కి తగ్గట్టు ముందుకు వెళ్లాలి అని అనుకుంటూ ఉంటారు.. ఎవరిష్టం వాళ్లది ఎవరి ఇష్టాన్ని మనం తప్పు పట్టలేము ..నో అని వేలెత్తి చూపించలేము.. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య తన పుట్టినరోజును ఇవాళ చాలా ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు.
మరి ముఖ్యంగా మూడుసార్లు గెలిచి హిందూపురం నియోజకవర్గం నుంచి సెన్సేషనల్ రికార్డుని క్రియేట్ చేశాడు బాలయ్య . ఈ క్రమంలో నే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఫాన్స్ ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన విషయాలను ట్రెండ్ చేస్తున్నారు . కాగా రీసెంట్ గా ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. బాలయ్య తన పుట్టినరోజుకి కచ్చితంగా చేసే పని ఇదే అంటూ అభిమానులు బాగా ట్రెండ్ చేస్తున్నారు .
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహముగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య తన పుట్టినరోజు నాడు కచ్చితంగా ముందు తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రపటం వద్దకు వెళ్లి కచ్చితంగా ఆశీర్వాదం తీసుకుంటారట . ఆ తర్వాతనే ఆయన బర్త్డ డే సెలబ్రేషన్స్ లో పాల్గొంటారట. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే ఆయనకు అంత ఇష్టం . అంతేకాదు మొదటి నుంచి బాలయ్య అదే విధంగా చేస్తూ వస్తున్నారట . తండ్రి పై ఉన్న గౌరవాన్ని ఇష్టాన్ని ఈ విధంగా చూపిస్తూ ఉంటాడు బాలయ్య అంటూ అభిమానులు తెగ ట్రెండ్ చేస్తున్నారు..!!