బాలయ్య ఫ్యాన్స్ మాస్ అని తెలుసు కానీ ఇంత రేంజ్ లో మాస్ అనే విధంగా షాక్ అయిపోతున్నారు అభిమానులు . మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు . అందుకే ఆయనను అభిమానించే జనాలు కూడా అలానే ఉంటారు . మరి ముఖ్యంగా ఆయనను ఒక ఫ్యాన్ లా కాకుండా ఇంటి పెద్దదిక్కులా అనుకుంటూ ఉంటారు . రీసెంట్గా హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన బాలకృష్ణ భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే .
ఈ క్రమంలోనే హ్యాట్రిక్ విజయం సాధించిన బాలయ్యకు ఫ్యాన్స్ ఊర నాటు మాస్ రేంజ్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సాధారణంగా ఎవరైనా సరే గెలిస్తే ఏం చేస్తారు..? పార్టీలు చేసుకుంటారు ..ఆయన ఫోటోకి పూలమాలలు వేసి సత్కరిస్తారు . అయితే ఇక్కడ బాలయ్య ఫ్యాన్స్ ఎలా అంటే పొట్టేల తలకాయలు నరికేసి ఆ తలకాయలతో మాల చేసి ఆ మాలను బాలయ్య కటౌట్ కి వేశారు. దీనితో సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ గా మారింది .
ఈ వీడియో చూసిన జనాలు వామ్మో ఏంట్రా బాబు ..బాలయ్య ఫ్యాన్స్ ఈ రేంజ్ లో ఉన్నారు ..?అంటూ మాట్లాడుకుంటున్నారు . బాలయ్య మాస్ ..బాలయ్య ఫ్యాన్స్ కూడా ఊరనాటు మాస్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు . ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా త్వరలోనే బాలయ్య బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూట్ లో పాల్గొనబోతున్నాడు..!!
Mass Celebrations 🔥🔥
పొట్టేలుతో దండ🔥🔥
Hatrrick MLA – 2014,2019,2024💥
Hattrick Hero : #Veerasimhareddy #BhagavanthKesari #Akhanda #NandamuriBalakrishna pic.twitter.com/WbcpWO5qEV
— manabalayya.com (@manabalayya) June 7, 2024