భర్తకు విడాకులు ఇవ్వనున్న మరో స్టార్ హీరోయిన్.. ప్రూఫ్ ఇదే..?!

ప్రస్తుతం ఇండ‌స్ట్రీలో టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా విడాకుల వార్తలు విన‌బ‌డుతున్న సంగతి తెలిసిందే. గతంలో భారీ భారీ డైలాగ్స్ చెప్పి.. బాండింగ్ గురించి, ప్రేమ గురించి వర్ణించిన స్టార్ సెలబ్రిటీలు సైతం విడాకులు తీసుకుని విడిపోయి ఫ్యాన్స్ కోసం షాక్ ఇస్తున్న సంఘటనలో చూస్తూనే ఉన్నాం. చెప్పినంత సులువు కాదు జీవించడం అంటూ నచ్చ చెప్పుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. సినీ, టీవీ ఇండస్ట్రీలో ఈ విడాకుల వార్తలు మరింత కామన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో హీరోయిన్ ఈ జాబితాలో చేరిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Niti Taylor Movies, News, Photos, Age, Biography

అది కూడా టాలీవుడ్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కావడంతో ఈ అమ్మడి పై వార్తలు మరింత వైరల్ గా మారాయి. అమె మరెవరో కాదు.. మేం వయసుకు వచ్చాం సినిమాతో దిల్ అనే ముస్లిం అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకులకు చేరువైన నిదీ టేలర్. దీని తర్వాత పెళ్లి పుస్తకం, లవ్ డాట్ కామ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ మంచి అవకాశాలు దక్కించుకుంది. బుల్లితెరపై వరుస అవకాశాలను అందుకుంటూ బిజీబిజీగా మారిన ఈ అమ్మడు.. ఆర్మీ అధికారి పరీక్షిత్ భవన్‌ను ప్రేమించి 2020లో వివాహం చేసుకుంది.

Niti Taylor Talks About Her Past Relationships Before Getting Married To  Her Husband, Parikshit Bawa

కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య గ్రాండ్ లెవెల్లో వివాహం జరిగింది. ఇదిలా ఉంటే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ అమ్మడు.. తన సోషల్ మీడియా పేజీలో ఆమె పేరు పక్క నుంచి భర్త పేరును తొలగించడం.. అలాగే అతనితో కలిసి ఉన్న కొన్ని ఫొటోస్, వీడియోస్ రిమూవ్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ అమ్మ‌డి విడాకులు న్యూస్ హాట్ టాపిక్ గా మారాయి. ఆమె ఫాలోవర్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. నిదీ టేలర్ విడాకులు తీసుకోవడం ఏంటి.. వీరిద్దరూ ఎప్పుడు అన్యోన్యంగా ఉంటారు కదా అంటూ.. చూడవచ్చటగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడం ఏంటి అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్యన నిజంగానే విడాకులు జరిగాయా లేదా తెలియాలంటే ఈ వార్తలపై ఎవరో ఒకరు స్పందిస్తే కానీ క్లారిటీ రాదు.