బ్రహ్మానందం క్రియేట్ చేసిన ఆ రేర్ రికార్డ్.. ఎప్పటికీ ఎవ్వరూ టచ్ కూడా చేయలేరు..?!

టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం పేరుకు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ ఉందో చెప్ప అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలు తో సక్సెస్ అందుకున్న బ్రహ్మానందం.. ఓ సినిమాలో ఆయన ఉన్నాడంటే చాలు ఇక నువ్వుల పంట పండినట్టే అనే ముద్ర వేసుకున్నాడు. కమెడియన్గా దాదాపు 1,150 కి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మీ.. తన సినీ కెరీర్‌లో ఓ రేర్‌ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బ్రహ్మానందం పేరు పై ఉన్న ఆ రేర్‌ రికార్డ్ నెటింట‌ వైరల్‌గా మారింది.

ఒకే ఏడాదిలో ఏకంగా 51 సినిమాల్లో నటించి ఒక క్రేజీ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 1997లో బ్రహ్మానందం ఏకంగా 50 సినిమాల్లో నటించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. ఫ్యూచర్ లోను బ్రేక్ కానీ రికార్డు ఇది అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తున్న బ్రహ్మానందం కల్కి 2898ఏడి సినిమాలోను ఓ కీలక‌ పాత్రలో నటిస్తున్నాడ‌ని టాక్.

కల్కి ప్రిల్యూడ్ ఇంగ్లీష్ వర్షన్ లో తన పాత్రకు బ్రహ్మానందం స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారని తెలుస్తోంది. అయితే రెమ్యున‌రషన్ విషయంలోనూ బ్రహ్మానందం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. గతంలో రోజుకు పది లక్షలు ఛార్జ్ చేస్తున్నాడంటూ వార్తలు రావడం విశేషం. కామెడీ సీన్స్ యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తూ ఉంటాయి. ప్రస్తుతం 68 సంవత్సరాలు ఉన్న బ్రహ్మానందం ఇప్పటికీ త‌న కామెడీ టైమింగ్‌తో ఈ జనరేషన్ ను కూడా ఆకట్టుకుంటున్నాడు.