తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ తో సినిమాలను తరికెక్కించి భారీ పాపులారిటి దక్కించుకున్న శంకర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఇండియన్ 2 సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ అంచనాఉ ఉన్నాయి. మంచి సక్సెస్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఇక సినిమా రిలీజై ఎలాంటి సక్సస్ అందుకుంటుందో చూడాలి. ఈ క్రమంలో శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజెర్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ చేంజెర్ విషయంలో శంకర్ కాస్త భయపడుతున్నట్లు తెలుస్తుంది.
ఒకవేళ భారతీయుడు 2 సినిమా తేడా కొడితే.. గేమ్ చేంజర్ సినిమాపై ఎఫెక్ట్ బాగా పడుతుందని టెన్షన్ లో ఉన్నాడట. ఇక ఇప్పటికే శంకర్ మెగాస్టార్ తో పాటు చరణ్‌కు కూడా కచ్చితంగా ఈ సినిమాతో హిట్ ఇస్తానని హామీ ఇచ్చి.. మూడు సంవత్సరాల పాటు చరణ్ నీ తన కోసం వెయిట్ చేయించుకున్నాడు. అయినా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఈ సినిమా విషయంలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని ఆందోళనలో ఉన్నాడట శంకర్. ఇప్పటికే శంకర్ పై చరణ్ అభిమానులు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంత సమయం తీసుకుని కూడా సినిమా ఇంకా పూర్తి చేయలేదంటూ అతనిపై ఎప్పటికప్పుడు ఫైర్ అవుతూనే ఉన్నారు.
ఇక కంటెంట్ లో ఏదైనా తేడా కొడితే.. చరణ్ అభిమానుల చేతిలో శంకర్‌కు భారీ ట్రోల్స్ తప్పవు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే.. శంకర్ తీయబోయే నెక్స్ట్ సినిమాలకు స్టార్ హీరోలు అవకాశాలు కూడా ఇవ్వరు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో శంకర్ ఎలాగైనా గేమ్ రచేంజర్‌తో మంచి సక్సెస్ సాధించాలని ఉద్దేశంతో మరింత ఎక్కువగా సినిమాపై కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి టఫ్ కండిషన్లో శంకర్ ఒకేసారి ఇండియన్ 2, గేమ్ చేంజర్ సినిమాలను రిలీజ్ చేసి.. తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.