యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అభిమానుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా తారక్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల విషెస్ మోత మోగిపోయిన సంగతి తెలిసిందే. ఇక తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ దక్కించుకున్న తారక్.. భార్య లక్ష్మీ ప్రణతిని ఎప్పుడు తన స్పెషల్ లక్‌గా భావిస్తూ ఉంటాడు. అందరు స్టార్ హీరోలతో ఎంతో ఫ్రెండ్లీగా ఉండే ఈయన.. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో భరతుడి పాత్రతో కెరీర్ ప్రారంభించాడు. ఆ టైంలో తారక్ వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలు కావడం విశేషం.
తర్వాత బాల రామాయణం రాముడిగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటివరకు 29 సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలోని లైన్ లో ఉంచుకున్న తారక్ జపాన్‌లో సైతం భారీ పాపులారిటీ ఉంది. నటుడుగానే కాకుండా మంచి గాయకుడిగా, హోస్ట్ గాను గుర్తింపు తెచ్చుకున్న తారక్ లక్కీ నెంబర్ 9. ఇక ఎన్టీఆర్ తను నటించిన సింహాద్రి సినిమా ఏకంగా వేయి స్క్రీన్‌లలో రీ రిలీజై రికార్డ్ సృష్టించింది. అయితే తారక్ లో ఉన్న ఆ స్పెషాలిటీ కారణంగా ఆయన స్టార్ హీరోగా ఎదిగాడు అంటు నెటింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
అవేంటంటే.. ఇప్పటివరకు తారక్ నటించిన 29 సినిమాల్లో ఒక్క సినిమాల్లో కూడా తన క్యారెక్టర్ ను రిపీట్ చేయలేదు. ఎలాంటి డైలాగ్స్ అయినా అలవోకగా చెప్పడం.. చిన్నచిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా అద్భుతంగా పలికించడం తారక్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఈ లక్షణాలే తారక్ ను స్టార్ ను చేశాయని అభిమానులు చెబుతున్నారు. ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ.. ఎన్టీఆర్ నటుడుగా మాత్రం ఎప్పుడూ సక్సెస్ సాధిస్తూనే ఉన్నాడు. తన నటనతో రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతున్న తారక్.. రెమ్యునరేషన్ లోను టాప్ లో నిలిచాడు.