ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నుంచి రాబోతున్న సినిమాలలో ప్రేక్షకులంతా మోస్ట్ అవైటెడ్ గా వెయిట్ చేస్తున్న సినిమా కల్కి 2898 ఏడి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై.. ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా డిజిటల్ హక్కులు కూడా ఇప్పటికే భారీ ధరకు అమ్ముడుపోయాయట. అలాగే ఈ సినిమా థియేటర్లు బిజినెస్ లు కూడా భారీ లెవెల్లో జరుగుతున్నాయని టాక్. ఇక బాహుబలి తో ప్రభాస్ ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నాడు.
అదే రేంజ్ లో కల్కి సినిమాతో సంచలనం సృష్టిస్తాడు అని మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయబోతున్నాడని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ల మధ్య కల్కి యాడ్స్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం ఈ 10 సెకండ్ల ఆడ్ కోసం కల్కి మేకర్స్ రూ.2.5 నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది. హీరోగా ప్రభాస్ నటించిన సినిమా కాబట్టి ఈ రేంజ్ లో ప్రమోషన్స్ కు ఖర్చు పెట్టడంలో మేకర్స్ ఆలోచించడం లేదని సమాచారం.
ఇదేవిధంగా మరిన్ని కొత్త ప్లాన్స్ తో కలిపి ప్రమోషన్స్ కు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. కల్కి రిలీజ్ చేయడానికి మూవీ పై అంచనాలను రెట్టింపు చేస్తే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తుంది. ఇక సినిమా నుంచి రానున్న ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సినిమాపై వస్తున్న హైప్‌కు తగ్గట్టే ఇందులో ట్విస్టులు కూడా ఉంటాయట. ఇక కల్కి ఫస్ట్ పార్ట్ జూన్ 27న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.