అప్పుడు మహానటిగా.. ఇప్పుడు మరో సెల‌బ్రెటీ బయోపిక్ లో కీర్తి సురేష్..?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్, నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ మూవీలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో జీవించేసింది అనడంలో సందేహం లేదు. 2019లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో కీర్తి సురేష్‌కు నేషనల్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ అయ్యి ఆరేళ్లు పూర్తి అయినా.. ఇప్పటికీ సినిమాలోని ఎన్నో అద్భుత సన్నివేశాలు ప్రేక్షకుల కళ్ళల్లో మెదులుతూనే ఉన్నాయి. సావిత్రి పాత్రలో పూర్తిగా ఒదిగిన ఈ అమ్మడు.. అచ్చు సావిత్రిలా సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఇక తాజాగా ఇప్పుడు కీర్తి సురేష్ కి మరో సెలబ్రిటీ బయోపిక్ అవకాశం వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Mahanati (2018)

పాపులర్ సింగర్ ఎమ్. ఎస్. సుబ్బలక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న బయోపిక్‌లో కీర్తి సురేష్ సుబ్బలక్ష్మి పాత్రలో నటించనుందని టాక్. ఎం. ఎస్. సుబ్బలక్ష్మి గురించి తెలియని వారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. ఆమె పాడిన వెంకటేశ్వర సుప్రభాతంతో చాలామంది రోజు మొదలవుతుంది. ప్రస్తుతం ఆమె జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. అయితే నిర్మాణ సంస్థ, దర్శకుడు, క్యాస్టింగ్ ఇతర వివరాలు ఏవి ఇంకా బయటకు రాలేదు. టైటిల్ రోల్ లో మాత్రం కీర్తి నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సుబ్బలక్ష్మి జీవితంలో ఎన్నో టర్నింగ్ పాయింట్లను చూశారు. మొదట‌ సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఈమె ప్రపంచమంతా కీర్తించే సింగర్‌గా జర్నీలో ఎన్నో చెప్పుకోదగ్గ ఘ‌ట్టాలని పూర్తి చేసింది.

MS Subbulakshmi Birth Anniversary: Lesser Known Facts Of This Carnatic  Singer

1997లో భర్త చనిపోవడంతో సింగర్ జీవితానికి కూడా స్వస్తి చెప్పిన ఎమ్‌. ఎస్. సుబ్బలక్ష్మి 2004లో తొలి శ్వాస విడిచారు. ఇప్పటికీ ఆమె పాటల రూపంలో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఆమె పాడిన భక్తి పాటలు ఎవరినైనా ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి తీసుకువెళ్తాయి. పేరుకి తమిళనాడులో పుట్టినా తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటకలోనూ మంచి పేరు సంపాదించుకున్న సుబ్బలక్ష్మి లక్షల్లో అభిమానులను దక్కించుకుంది. అప్పట్లో ఆమె ఆడియో క్యాసెట్లు హాట్ కేకుల్లా క్షణాల్లో అమ్ముడుపోయేది. ఇక అలాంటి స్టార్ సింగర్ జీవిత చరిత్రను చూడాలని ఆసక్తి ఎంతో మందిలో ఉంది. ఇక అమరగాయని ఎమ్. ఎస్. సుబ్బలక్ష్మి పాత్రలో కీర్తి సురేష్ ని చూడాలని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు. ఒకవేళ ఆమె ఈ సినిమాలో నటించలేక పోతే త్రిష లేదా నయనతారను సంప్రదిస్తారట.