రమ్యకృష్ణ .. మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ .. తన అందంతో కుర్రాళ్లను ఓ రేంజ్ లో ఊపు ఊపేసిన బ్యూటీ . టాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీని ఏ రేంజ్ లో అల్లాడించేసిందో మనకు బాగా తెలుసు . అందం అభినయం ఉన్న రమ్య నటనకు ఎంతోమంది ఫాన్స్ కూడా ఉన్నారు . మనలో చాలామంది రమ్యకృష్ణకు బిగ్ ఫ్యాన్స్. కాగా రీసెంట్గా రమ్యకృష్ణ కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఎప్పుడు కూడా చాలా ధైర్యంగా చాలా బోల్డ్ గా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడే రమ్యకృష్ణ సైతం చాలా చాలా కష్టాలను అనుభవించింది అని ఈ వార్త యొక్క సారాంశం .
తాను పడిన బాధల గురించి తెలుపుతూ రమ్యకృష్ణ స్టేజ్ పైన కన్నీరు పెట్టుకుందట. ఈ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ చాలా సెలెక్టివ్ పాత్రలో చూస్ చేసుకుంటూ వెళుతున్న రమ్యకృష్ణ కెరియర్ స్టార్టింగ్ లో ఎలాంటి పాత్రలో నటించిందో మనకు బాగా తెలుసు. కాగా రమ్యకృష్ణను చాలామంది హీరోయిన్ గా సెలెక్ట్ చేసి సినిమాలో నుంచి తీసేశారట. అది ఆమెకు చాలా బాధగా అనిపించేదట. ఇక తెలుగులో ఎలాంటి అవకాశాలు రావు అనుకునే సమయంలోనే కే రాఘవేంద్ర రావు గారు తనకు లైఫ్ ఇచ్చారట.
అల్లుడుగారు సినిమాకు ఎంపిక చేయడం ..ఆ సినిమా అప్పుడు హిట్ అవ్వడం .. ఆమె కెరియర్‌కే ప్లస్ పాయింట్ గా మారిపోయిందట . ఆ తర్వాత పలు బ్లాక్ బస్టర్ సినిమాలలో అవకాశాలు అందుకొని రమ్యకృష్ణ తన టాలెంట్ ను బయట పెట్టుకుందట . ఒకానొక స్టేజ్ లో రమ్యకృష్ణ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని కూడా ఆలోచించిందంట. చాలామంది కావాలని సెలెక్ట్ చేసి సినిమాల నుంచి తప్పించారట . ఆ టైంలో రాఘవేంద్రరావు మాత్రమే తనను నమ్మి అవకాశం ఇచ్చారట . ఆయన వల్ల ఇంత స్టార్ గా ఎదిగాను అంటూ చాలా చాలా ఎమోషనల్ గా మాట్లాడింది రమ్యకృష్ణ..!