ఓరి దేవుడోయ్.. అప్పుడే శోభిత అన్ని కోట్లు కూడబెట్టిందా..? సమంత నే మించిపోయిందిగా..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు . అది ఏ విషయంలోనైనా సరే ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోవడమే కాకుండా బోల్డ్ రోల్స్ చేస్తూ హాట్ హీరోయిన్స్ గా మారిపోతున్నారు . అంతేకాదు దానికి తగిన రేంజ్ లోనే రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నారు . అయితే సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలమే అవుతున్న ఇంకా సొంత ఇల్లు కూడా కొనుక్కోలేని హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. కానీ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా తక్కువ టైం అయినప్పటికీ కోట్లకు కోట్ల ఆస్తులు సంపాదించుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు .

ప్రెసెంట్ ఇప్పుడు అదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది .శోభిత ధూళిపాళ ..తెలుగు బ్యూటీనే కానీ హిందీలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమాలతో సైతం తన హవా కొనసాగించింది . ప్రజెంట్ నాగచైతన్యతో డేటింగ్ లో ఉన్నట్లు ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. కాగా రీసెంట్గా శోభిత ధూళిపాళకు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఈ అందాల ముద్దుగుమ్మ ఎంత హాట్ గా ఉంటుందో మనకు తెలిసిందే. మోడలింగ్ చేస్తూ కెరీర్ ని ప్రారంభించిన ఈ బ్యూటీ 2016లో రామన్ రాఘవన్ 2.0 చిత్రంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది .

ఆ తర్వాత తనదైన స్టైల్ లో దూసుకుపోయింది . గూడచారి చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టి సెన్సేషనల్ హిట్ అందుకుంది . ఆ తర్వాత శోభిత ధూళిపాళ రేంజ్ ఏవిధంగా మారిపోయిందో అందరికీ తెలిసిందే.. శోభిత ధూళిపాళ వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది . అంతేకాదు ఆమె ఇండస్ట్రీలోకి వచ్చి తక్కువ టైమ్ అయినప్పటికీ కోట్ల ఆస్తి సంపాదించేసింది అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. శోభిత ధూళిపాళ పలు వెబ్ సిరీస్ లో కూడా నటించి మెప్పించింది . ఒక్కొక్క సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న శోభిత ధూళిపాళ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 – 30 కోట్లకు పైగానే ఆస్తులు కూడా పెట్టిందట.

.నిజానికి ఇండస్ట్రీకి వచ్చిన ఇంత తక్కువ టైంలో హీరోయిన్ సమంత కూడా అంత ఆస్తులు కూడా పెట్టలేదని.. కానీ సమంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంది అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి శోభిత ధూళిపాల ఏదో ఒక అంశం కారణంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది..!!