పుష్ప 2 సెకండ్ సింగిల్ ప్రోమ్ చేశారా.. శ్రీ‌వ‌ల్లి వ‌చ్చేసిందోచ్.. ఇక ఫ్యాన్స్‌కు పండగే..!!

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి తెర‌కెక్కుతున్న సినిమాల‌లో పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎదుతుచూస్త‌తున్న సినిమా పుష్పా 2. ఎక్కడ చూసినా పుష్ప మానియా నడుస్తుంది. పుష్ప.. పుష్పరాజ్.. అంటూ ఓ రేంజ్ లో ఐకాన్ స్టార్ పేరు మారుమోగిపోతుంది. పుష్ప మూవీ డైలాగ్స్ తో , సినిమా ఫస్ట్ సింగల్ స్టెప్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బన్నీ.. త్వరలోనే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడానికి సిద్ధమయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన శ్రీవల్లి పాత్రలో నటిస్తోంది. అదిరిపోయే రేంజ్ లో ఆక‌ట్టుకునేల ఉంది. రష్మిక ఫస్ట్ లుక్ తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు మేకర్స్.

Pushpa The Rule: Icon Star intense poster ahead of first single |  cinejosh.com

ఇక ఇటీవల సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందేజ‌ భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్ అయిందంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు మూవీ టీం. ఇందులో శ్రీవల్లి సెకండ్ సింగిల్ సంబంధించిన అప్డేట్ను అందించింది. శ్రీవల్లి, పుష్ప గాడి డ్యూయెట్ సాంగ్ త్వరలో రానున్నట్లు ఈ వీడియోతో క్లారిటీ వచ్చింది.

రష్మిక చిన్న బైట్ వీడియో తో సూసేటి అగ్గి ర‌వ్వలా ఉంటాడు నా సామీ అంటూ అనౌన్స్ చేసింది. 29 మే ఉదయం 11 గంటల 7 నిమిషాలకు సాంగ్ రిలీజ్ అంటూ అస్డేట్ ఇచ్చింది. సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మళ్ళీ ఆయన మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడో లేదో వేచి చూడాలి. ఇక ఈ సినిమా ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూస్తామా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.