“ఆ హీరోయిన్ టూ హాట్”..డార్లింగ్ నోట ఊహించని మాట.. పట్టేసిన ఫ్యాన్స్..!

ఇప్పుడు ప్రభాస్ ఏం మాట్లాడినా సరే ..అది పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ గా మారిపోతుంది. మరీ ముఖ్యంగా డార్లింగ్ అభిమానులు ఆయన ఏం మాట్లాడతారా..? ఎలా ట్రెండ్ చేద్దామా..? అని కాచుకొని కూర్చుని ఉన్నారు. తాజాగా ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే . భారీ ఎత్తున స్టార్స్ అలాగే అభిమానులు పాల్గొని ఈ ఈవెంట్ ను సూపర్ సక్సెస్ చేశారు .

కాగా ఈ ఈవెంట్లో ప్రభాస్ స్పీచ్ హైలెట్గా మారింది . మరీ ముఖ్యంగా సినిమాలో తనతో వర్క్ చేసిన నటీనటులను ఓ రేంజ్ లో పొగిడేసారు . మరీ ముఖ్యంగా కమల్ హాసన్ – అమితాబచ్చన్ – దీపికా పదుకొనే వాళ్ళను పొగుడుతూ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడారు. గ్లోబల్ బ్యూటీ అంటూ ఇంటర్నెషనల్ స్టార్ అంటూ దీపికౌ పొగిడేశారు. దిశాపటాని దగ్గరికి వచ్చేసరికి టూ హాట్ అంటూ పొగిడేశారు.

నిజానికి ఎప్పుడూ కూడా ప్రభాస్ ఇలా హీరోయిన్స్ ని హాట్ అంటూ పొగిడిన సందర్భాలు లేవు . అలాంటి ఓరేర్ కామెంట్ ప్రభాస్ నుంచి దక్కించుకున్న హీరోయిన్ దిశా పటానినే అంటూ అభిమానులు ఓ రేంజ్ లో ఆయన మాటలను ట్రెండ్ చేస్తున్నారు . ప్రెసెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . ఈ సినిమాలో దిశా పటాన్ని అదేవిధంగా ప్రభాస్ మధ్య సాంగ్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సాంగ్ సినిమాకే హైలేట్ గా మారబోతుందట..!!