సమంత – బన్నీ కాంబోలో రావాల్సిన ఆ సినిమాకి అడ్డుపడింది ఎవరు? తెర వెనుక అంత జరిగిందా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత .. అలాగే పాన్ ఇండియా హీరో బన్నీ పేర్లు ఓ రేంజ్ లో మారుమ్రోగి పోతున్నాయి. మరీ ముఖ్యంగా సమంత ఏ ఇంటర్వ్యూ కి వెళ్ళినా సరే పరోక్షకంగా బన్నీ పేరుని ప్రస్తావిస్తూ మరింత హైలెట్గా మారిపోయింది. తన రోల్ మోడల్ బన్నీ అని .. బన్నీ ఇన్స్పిరేషన్గా తీసుకొని తను కొన్ని కొన్ని సినిమాలు చేస్తున్నాను అని ఓపెన్ గా చెప్పేసింది . అంతేకాదు సుకుమార్ సైతం సమంత మంచి హీరోయిన్ అని ..తాను సినిమాలు తెరకెక్కిస్తున్నంత కాలం ఆమెకు ఏదో ఒక రోల్ ఇస్తూనే ఉంటాను అని ప్రామిస్ చేశాడు .

ఇలాంటి మూమెంట్లోనే సమంత బన్నీ కాంబోలో రావాల్సిన సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా ఎందుకు మిస్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సమంత బన్నీ సన్నాఫ్ సత్యమూర్తి అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది సమంత. బన్నీ పైకి ఎక్కి స్టెప్స్ అదరగొట్టేసింది . అయితే వీళ్ళ కాంబోలో అంతకుముందే ఒక సినిమా రావాల్సింది . ఆ సినిమా మరేదో కాదు అత్తారింటికి దారేది.

పవన్ కళ్యాణ్ హీరోగా సమంత హీరోయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . నిజానికి ఈ సినిమాను బన్నీ కోసం రాసుకున్నాడట త్రివిక్రమ్ . కొన్ని కారణాల చేత ఆయన రిజెక్ట్ చేయడంతో ఈ ఆఫర్ పవన్ కళ్యాణ్ కు వెళ్ళింది . సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్ మైల్ స్టోన్ క్రియేట్ చేసింది ఈ మూవీ . అలా ఈ సినిమా బన్నీ చేతుల నుంచి పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్లిపోయింది..!!