విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” సినిమా దొబ్బేసిందిరోయ్..!? ఆనందంలో ఆ ఇద్దరు స్టార్స్..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ నటించిన తాజా సినిమా ఫ్యామిలీ స్టార్ . పరశురాంపేట్ల దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంటుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేశారు . అయితే విజయ్ దేవరకొండ రేంజ్కి ఈ సినిమా కరెక్ట్ కాదు అంటూ పలువురు ఫ్యాన్స్ ఓపెన్ గా చెప్పేయడంతో సినిమాకి నెగిటివ్ టాక్ క్రియేట్ అయింది . అంతేకాదు పలుచోట్ల సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నట్లు ఫ్యాన్స్ కూడా చెప్పుకు వస్తున్నారు. దీంతో ఈ సినిమా అనుకున్నంత హై ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయింది ..

కొందరు సినిమా దొబ్బేసింది అంటూ కూడా రివ్యూలు ఇస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే తెరపైకి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో ఇద్దరు స్టార్స్ తెగ ఆనందపడుతున్నారట. వాళ్లు మరెవరో కాదు అల్లు అరవింద్ – నాగచైతన్య అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు. నిజానికి పరశురాం డైరెక్షన్లో విజయ్ హీరోగా వచ్చిన గీతా గోవిందం సినిమా గీతా బ్యానర్ తెరకెక్కిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కూడా వీళ్ళ కాంబోలో ఒక సినిమా రావాలి అది అల్లు అరవింద్ నిర్మించాలి అని ఎంతో ఆశపడ్డారు ..అడ్వాన్స్ కూడా ఇచ్చాడట .

ఆ క్రమంలోనే పరశురాం ..అల్లు అరవింద్ కి హ్యాండ్ ఇస్తూ దిల్ రాజుతో చేతులు కలిపి లాస్ట్ మూమెంట్లో సినిమాను చేతులు మార్చేశాడట. ఆ తర్వాత కోపంతో అల్లు అరవింద్ పరోక్షంగా కొన్ని ఘాటు కౌంటర్లు కూడా చేశారు . అయితే ఇప్పుడు పరశురాం తెరకెక్కించిన సినిమా ఫ్లాప్ కావడంతో అల్లు అరవింద్ హ్యాపీగా ఫీలవుతున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు నిజానికి అల్లు అరవింద్ పరశురాంపేట్ల దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో నాగచైతన్యకు ఛాన్స్ ఇస్తూ సినిమాకు కమిట్ అయ్యారట . పరశురాం – అల్లు అరవింద్ కు -నాగచైతన్యకు హ్యాండ్ ఇచ్చి దిల్ రాజు – విజయ్ దేవరకొండ తో చేతులు కలిపాడు అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాప్ అవడంతో అల్లు అరవింద్ అలాగే నాగచైతన్య ఫుల్ జోష్ లో ఉన్నారు అంటూ పలువురు జనాలు ట్రోల్ చేస్తున్నారు..!!