“ఫ్యామిలీ స్టార్” ఫస్ట్ డే కలెక్షన్స్: విజయ్ దేవరకొండ పరువు సంకనాకీ పాయే.. ఇంత చెత్త వసూళ్లా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. కూడా స్పెషల్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఇక్కడ మనం చాలానే ఉంటాయి . ఆటిట్యూడ్ హీరో అంటూ కొంతమంది రౌడీ హీరో అంటూ మరి కొంతమంది ముద్దుగా పిలుచుకునే విజయ్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ . తన బాడీ లాంగ్వేజ్ కి సూట్ అవ్వని ఒక డిఫరెంట్ జోనర్ ని టచ్ చేయడంతోనే అభిమానుల మనసులను కొల్లగొట్టాడు విజయ్ దేవరకొండ.

నిజానికి ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ జోనర్ సినిమాలు చేయకూడదు అనుకునే వ్యక్తి విజయ్ దేవరకొండ . అందుకే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ ఉంటాడు . రీసెంట్గా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ క్రియేట్ చేసుకుంది. కొంత మంది జనాలకు ఫ్యామిలీ స్టార్ సినిమా నచ్చితే మరి కొంత మంది జనాలకు ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది .

కాగా ఇదే క్రమంలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ డే కలెక్షన్స్ దారుణాతి దారుణంగా పడిపోవడంతో ఫ్యాన్స్ డీలా పడిపోయారు. పరశురాంపేటలో దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా మొదటిరోజులో కలెక్షన్స్ బయటపడ్డాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఆరు కోట్ల వరకు షేర్ వసూలు చేసింది .

వరల్డ్ వైడ్ గా ఎనిమిది పాయింట్ 20 కోట్లు రాబట్టినట్లు సమాచారం అందుతుంది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా 43 కోట్లు బిజినెస్ చేసుకుంది . అయితే విజయ్ దేవరకొండ రేంజ్ పబ్లిసిటీ పాపులారిటీతో కంపేర్ చేస్తే ఫస్ట్ 8.20 కోట్లు అంటే చాలా చాలా తక్కువ అంటున్నారు జనాలు . చూద్దాం మరి రానున్న రోజుల్లో ఫ్యామిలీ స్టార్ సినిమా ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో..??