పాపం..విజయ్ దేవరకొండ టైం ఇంత బ్యాడ్ గా ఉంది ఏంటి..? మరో కొత్త వివాదంలో రౌడీ హీరో..!

పాపం.. విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అయ్యే ఈ హీరో పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది . దానంతటకీ కారణం ఫ్యామిలీ స్టార్ సినిమా అని చెప్పుకోక తప్పదు. పరశురాంపెట్ల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ .

నిన్న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ అందుకుంది. రౌడీ హీరో రేంజ్ కి ఈ సినిమా మ్యాచ్ అవ్వలేదు అంటూ సొంత ఫ్యాన్సే మండిపడుతూ ఉండడం ఓ పక్క విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాప్ అయింది అన్న బాధలో విజయ అభిమానులు ఉంటే మరోపక్క రష్మిక ఫ్యాన్స్ విజయ్ దేవరకొండపై మండిపడుతున్నారు.

రష్మిక మందన్నా పుట్టినరోజు అయితే నువ్వు విష్ చేయలేదు అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు . విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమించుకుంటున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే దానిపై ఎక్కడా కూడా అఫీషియల్ ప్రకటన లేదు.. కానీ వీళ్ళ మధ్య చనువు చూస్తే ఖచ్చితంగా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మాత్రం తెలిసిపోతుంది సోషల్ మీడియాలో రష్మిక మందన బర్త్ డే సందర్భంగా విజయ్ ఎటువంటి పోస్ట్ చేయలేదు అని .. ఏ విధంగా విష్ చేయలేదు అని ఫాన్స్ మండిపడుతున్నారు . దీంతో మరో కొత్త వివాదంలో ఇరుక్కున్నట్లు అయింది రౌడీ హీరో..!!