ప్రభాస్ ‘కల్కి’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. పుష్ప రాజ్ గాడు సేఫ్ అయ్యాడు పో..!

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేస్తున్నా మూవీ కల్కి . ఫస్ట్ టైం ప్రభాస్ కెరియర్ లో పూర్తి సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ ఇదే కావడం గమనార్హం. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో అమితాబచ్చన్ – కమలహాసన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు . అందాల ముద్దుగుమ్మలు దీపికా పదుకొనే – దిశా పటానికి హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. రీసెంట్గా ఇటలీలో అద్భుతమైన లొకేషన్స్ లో ప్రభాస్ దిశా పటానిపై కొన్ని సీన్స్ అలాగే పాట కూడా చిత్రీకరించారు . దానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

ఇప్పటికే వైజయంతి బ్యానర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. మే 9న గ్రాండ్గా థియేటర్స్ లో విడుదల కాబోతున్నట్లు అఫీషియల్ గా చెప్పుకొచ్చింది. అయితే ఏపీలో ఎలక్షన్స్ నేపథ్యంలో ఆ రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేస్తున్నారు కల్కి సినిమా టీం అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ సినిమా రిలీజ్ డేట్ ను మే 30కి ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది .

త్వరలోనే దీనిపై వైజయంతి బ్యానర్స్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వబోతుందట . అప్పటికి ఎలక్షన్స్ వేడి తగ్గిపోతుంది సమ్మర్లో గ్రాండ్గా రిలీజ్ చేస్తే రిజల్ట్ కూడా బాగుంటుంది ..సమ్మర్ సెలవులను కూడా మనం క్యాష్ చేసుకున్నట్లు అవుతుంది.. పైగా ప్రభాస్ సినిమా.. అది సమ్మర్ కాదు వింటర్ కాదు ఏ సీజన్ అయినా చూస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే ..త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతుందట .

అయితే ఈ తాజా డేట్ తో పుష్పరాజ్ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయాడు . బన్నీ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది . గతంలో ఎలక్షన్స్ సందర్భంగా కల్కి పోస్ట్ పోన్ అయితే కచ్చితంగా పుష్ప2కు క్లాష్ అవుతుంది అంటూ ప్రచారం జరిగింది. కానీ దేవరకు పుష్పకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభాస్ మే 30న ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఓకే చేశారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు..!!