ఆ పని చేస్తేనే రష్మిక హీరోయిన్ అయ్యిందా..? లేకపోతే అలా చేసి డబ్బులు సంపాదించుకునేదా..?

నేడు రష్మిక మందన్నా.. పుట్టినరోజు ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ ఫ్రెండ్స్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు ఆమె సినిమాకి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు . పుష్ప 2 సినిమాకి సంబంధించి సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు . ఈ పోస్టర్లో రష్మిక మందన టూ ట్రెండీగా వైలెంట్ గా కనిపించింది .

పట్టుచీర .. ఒంటి నిండా నగలు ..వామ్మో ఈ లుక్ లో మాత్రం అద్దిరిపోయింది అని చెప్పాలి . ఇలాంటి క్రమంలోనే అసలు రష్మిక ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎలా అడుగు పెట్టింది ..?అన్న విషయం బాగా ట్రెండ్ అవుతుంది. నిజానికి రష్మిక హీరోయిన్గా అవ్వాలి అని అనుకోలేదట . ఆమె ఎయిర్ హోస్టస్ గా తన కెరియర్ను ముందుకు తీసుకెళ్లాలి అంటూ ఆశపడిందట .

అయితే ఇదే క్రమంలో రష్మిక ఫ్రెష్ ఫేస్ 2014 టైటిల్ గెల్చుకున్న తర్వాత ఆమెకు కన్నడ ఇండస్ట్రీ నుంచి కిర్రాక్ పార్టీ అనే సినిమాలో ఛాన్స్ వచ్చిందట . ఈ సినిమా ఆఫర్ రావడంతో ఆమె స్టార్ హీరోయిన్గా మారిపోయింది . తర్వాత తెలుగులో ఛలో అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి వచ్చింది. ఇక ఆ తర్వాత అమ్మడు రేంజ్ లో మారిపోయిందో మనకు తెలిసిందే. ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి 7 నుంచి 10 కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది . ఒకే ఒక్క రాత్రి ఆమె లైఫ్ ని టర్న్ చేసేసింది . ఒకవేళ ఆమె ఫ్రెష్ ఫేస్ 2014లో పాల్గొనక పోయి ఉంటే ఆమె అనుకున్న విధంగా ఎయిర్ హోస్టస్ గా మారి కెరియర్ను ముందుకు తీసుకెళ్లి ఉండేది అంటున్నారు జనాలు..!!