వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం..ఇక మెగా ఫ్యామిలీ మూడు ముక్కలుగా చీలిపోయినట్లేగా..!?

వరుణ్ తేజ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చిచ్చు పెట్టిందా ..? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు . సోషల్ మీడియాలో తాజాగా ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ఆ వార్త గురించి తెలుసుకున్న మెగా అభిమానులు షాక్ అయిపోతున్నారు. వరుణ్ తేజ్ అభిమానులు మాత్రం చాలా కూల్ గా లైట్ గా ఈ విషయాన్ని సింపుల్గా కొట్టి పడేస్తున్నారు. మెగా ప్రిన్స్గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నారట.

ఆల్రెడీ రామ్ చరణ్ కొణిదల ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడు . నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరిట ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది. ఆడపిల్లలు వేరు అలా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన పెద్దగా ఎవరు పట్టించుకోరు . అయితే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన అన్నదమ్ములు ఒకే పేరిట ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తే అది పెద్ద రాద్ధాంతం అయిపోతుంది . మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించింది అయితే పెంట పెంట చేసేస్తారు జనాలు.

ప్రజెంట్ అదే న్యూస్ వైరల్ అవుతుంది. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నారట . ఈ విషయంలో మెగా ఫ్యామిలీలో ఇష్యూస్ కూడా వచ్చాయట. అయినా సరే లావణ్య వరుణ్ తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారట . కొణిదెల పేరుతో మరొక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతున్నారట . దీంతో వరుణ్ తేజ్ అన్నకు పోటీగా ఈ పని చేస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . మరికొందరు లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఎవరి దారి వారు చూసుకుంటారు.. ప్రతిదీ రాద్ధాంతం చేస్తే ఎలా అంటూ వరుణ్ కి సపోర్ట్ చేస్తున్నారు .చూద్దాం దీనిపై మెగా కుటుంబం ఎలా స్పందిస్తుందో..???