స్నేహాను బన్నీ ముద్దుగా అలా పిలుస్తాడా? హౌ రొమాంటిక్ ఫెలో..!!

ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు కన్నా ముద్దు పేర్లు ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంటున్నాయి. అలానే జనాలు పిలుచుకుంటున్నారు. పప్పీ -లిల్లీ- రోజీ అంటూ నాటి నాటి పేర్లను పిలుచుకుంటున్నారు . మరి ముఖ్యంగా భార్యాభర్తలు ఎలా సరదాగా చిలిపిగా పిలుచుకుంటూ ఉంటారు మనందరికీ బాగా తెలిసిన విషయమే. రీసెంట్గా సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుగా తన భార్యను ఏమని పిలుస్తాడు అనే వార్త వైరల్ గా మారింది.

ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది రొమాంటిక్ కపుల్ గా పేరు సంపాదించుకున్నారు బన్నీ స్నేహ రెడ్డి . వీళ్ళ జంటను చూసి చాలామంది కుళ్ళుకుంటూ కూడా ఉంటారు . మేము ఇలా ఉండలేకపోయామే అంటూ బాధపడుతూ ఉంటారు . వీళ్ళ మధ్య అంత ప్రేమ ఉంది. వీళ్ళ మధ్య అన్యోన్యతను చూస్తే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఈర్ష్య పడుతూ ఉంటారు . తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది .

బన్నీని స్నేహ కన్నయ్య అంటూ ముద్దుగా పిలుస్తుందట . అదేవిధంగా స్నేహాన్ని బన్నీ క్యూటి అంటూ పెట్ నేమ్ తో ఎంతో ప్రేమ గా పిలుస్తాడట. ఈ విషయం చాలా సార్లు మనకి ప్రూవ్ చేశాడు . బన్నీ పుట్టినరోజు అయినా ..పెళ్లి రోజు అయినా.. స్పెషల్ అకేషన్ అయిన ..మై లిటిల్ క్యూటీ అంటూ స్నేహ రెడ్డిని ట్యాగ్ చేస్తాడు . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . బన్నీ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది..!!