నైట్ పడుకునే ముందు ఈ ఒక్క ఆకను నమిలితే చాలు.. బ్లడ్ షుగర్స్ ఇట్టే కంట్రోల్ అవుతాయా.. అదేంటంటే..?!

నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వాటి వాసన కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండ్లు తింటే శరీరంలో ఎన్నో అద్భుత ఫలితాలు చూడవచ్చు. అలాగే వీటి ఆకుల్లో కూడా అదే రేంజ్ లో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. రాత్రి సమయంలో నిద్రించే ముందు వీటిని తింటే మీరు ఊహించని ఫలితం దక్కుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ డయాబెటిస్ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆకును రోజు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి ఎంతగానో తోడ్పడుతుంది.

Jamun Leaves: నేరేడు ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. తప్పక తెలుసుకోవలసిన  సమాచారం మీ కోసం.. - Telugu News | Amazing health benefits and uses of jamun  Leaves | TV9 Telugu

మధుమేహం అనేది రక్తంలో గ్లూకోజ్‌ అధికంగా ఉండడం వల్ల కలిగే దీర్ఘకాలిక సమస్య. ఈ సమస్యతో ప్రస్తుత లైఫ్ స్టైల్ లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో క్లోమాం.. గ్లూకోజ్‌ను శక్తిగా మార్చడానికి తగినంత ఇన్సులిన్ అవసరమవుతుంది. ఇది తగిన మోతాదులో ఉత్పత్తి కాకపోవడంతో రక్తంలో అదనపు గ్లూకోస్ పెరిగి శరీరం పనిచేయడం కష్టతరమవుతుంది. అయితే మనం నిద్రిస్తున్న సమయంలో కూడా చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడే సమర్థవంతమైన ఆయుర్వేద హోమ్ రెమెడీ ఒకటి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

నేరేడు - వికీపీడియా

నేరేడు పండ్ల రసం మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి.. షూగ‌ర్ లెవెల్స్ నియంత్రించడానికి సహకరిస్తుంది. అలాగే నేరేడు పండ్ల ఆకులు రక్తంలో చక్కెరను బ్యాలెన్స్ చేసేందుకు సహకరిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో జంబోలిన్ లాంటి సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇది షుగర్ ని కంట్రోల్ చేయడానికి సహజ విధానమని చెప్పవచ్చు. అలాగే నేరేడు ఆకులలో పాలిఫెనాల్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. రాత్రి నిద్ర పోవడానికి ముందు ఓ నేరడాకును బాగా కడిగి నమలడం అలవాటు చేసుకుంటే కొన్ని రోజులకే మంచి ఆరోగ్య ఫలితం కనిపిస్తుంది.