ఇది బిగినింగ్ మాత్రమే.. ఓజి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన థమన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా , యంగ్ అండ్ టాలెంటేడ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టార్ డ్రామా ఓజీ. ఈ చిత్రం ను సెప్టెంబర్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేటందుకు మేకర్ సన్నాహాలు చేస్తున్నారు. మ్యాజికల్ సెన్సేషనల్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియోలో థమన్ మ్యాజిక్ హైలైట్ గా నిలిచింది. హంగ్రి చితా సాంగ్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఒక అభిమాని పవన్ కళ్యాణ్ ఎడిట్ వీడియోను షేర్ చేయగా, అందుకు థమన్ స్పందించారు. ఇది బిగినింగ్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు.

ఈ చిత్రంలో మ్యాజిక్ వేరే లెవెల్ ఉండబోతుంది అంటూ హింట్ ఇచ్చారు. ఇమ్రాన్ హష్మి మిలన్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రీ మా రెడ్లు లు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు.