టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన టీం.. స్ట్రీమింగ్ ఎక్కటంటే.. ?!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నిన్న మొన్నటి వరకు సీక్వెల్ అంటే అసలు సక్సెస్ వస్తుందో.. లేదో.. అన్న గ్యారెంటీనే ఉండేది కాదు. అసలు ఆడుతుందా.. లేదా.. అని ఆందోళన మేకర్స్ లో ఉండేది. అయితే ఇటీవల వస్తున్న సినిమాల్లో బలమైన కంటెంట్ సినిమాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకుల ఆదరణ అందుకుంటున్న ఎన్నో సినిమాలు సీక్వెల్ తెర‌కెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. దీనికి సీక్వెల్‌గా వచ్చిన సినిమాలు కూడా అదే రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ సాధిస్తున్నాయి. ఈ కోవాలో డీజే టిల్లు మూవీ కి సీక్వల్గా టిల్లు స్క్వేర్ సినిమా వ‌చ్చిన సంగతి తెలిసిందే. ఇది రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది.

దాదాపు రూ.67 కోట్ల షేర్ వ‌సుళ్ళ‌ను కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటిటి నెట్‌ఫ్లిక్స్ సంస్థ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. సినిమా ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. అంతే కాదు నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు తో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ టిల్లు స్క్వేర్ స్ట్రీమింగ్ కానుందంటూ ప్రకటించింది. మొత్తంగా డిజె టిల్లు అనే బ్రాండ్ టిల్లు స్క్వేర్ మూవీ మీడియా రేంజ్‌ను వేరే లెవెల్ కు తీసుకువెళ్ళింది.

మూవీ బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఓకే సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారాడు సిద్దు జొన్నలగడ్డ. ఇదే టిల్లు బ్రాండ్ తో సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్‌కు కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అంతేకాదు ఈ సినిమా మొదటి రోజే దాదాపు రూ.25 కోట్ల గ్రాస్ వ‌సూళ‌ను కొల్లగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక సిద్దు జొన్నలగడ్డ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. నాగచైతన్య హీరోగా వచ్చిన జోష్ సినిమాలో చిన్న పాత్రలో నటించిన ఆయన.. మొదటి నుంచి చిన్నచితికా పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.అయితే ఎన్నో ఏళ్ల శ్రమించిన తరువాత డిజే టిల్లుతో సిద్దుకి భారీ బ్రేక్ దొరికింది.

Blockbuster Tillu Square locks its OTT release date | Latest Telugu cinema  news | Movie reviews | OTT Updates, OTT

ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్‌తో మరోసారి రికార్డులను సృష్టించాడు. మొదటి పార్ట్‌ను ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరూ రెండో పార్ట్‌కు ఇట్టే కనెక్ట్ అవుతారు. డిజే టిల్లు రేంజ్‌లో సినిమా మెప్పించకపోయినా.. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అంటే రూ.28 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌తో రిలీజైన‌ ఈ మూవీ మొత్తంగా రూ.40 కోట్ల ప్రాఫిట్ అందుకొని 2024 లో ఎపిక్ హిట్ అందుకున్న మూవీ గా రికార్డ్ సృష్టించింది.