తండ్రి హరికృష్ణతో పోల్చుతూ తారక్ ను ఎగతాళి చేసిన స్టార్ కమెడియన్.. ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే.. !!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న తారక్ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. మొదట సింహాద్రి సినిమాతో సునామీని సృష్టించిన తారక్.. తర్వాత వరుస‌ సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయాడు. ఇక ఆయ‌న సినీ కెరీర్‌లో హిట్లు, ప్లాపులను ఎదురుకోవాల్సి వచ్చింది. అలాంటి క్రమంలో ఎన్టీఆర్‌ విపరీతమైన ట్రోలింగ్స్‌ కూడా ఎదురయ్యాయి. రాఖీ సినిమా టైంలో తారక్ బరువుపై ఎన్నో కామెంట్లు వినిపించాయని.. కొందరైతే నేరుగా తారక్‌కే చెప్పేసారని తెలుస్తుంది.

ఆ టైంలో కమెడియన్ ఆలీతో జరిగిన ఓ సంఘటన గురించి ఇటీవల తారక్ వివ‌రించాడు. య‌మ‌దొంగ టైం నుంచి ఆలీ,ఎన్టీఆర్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్న సంగతి తెలిసిందే. యమదొంగ టైంలో వీరిద్దరి మధ్యన మంచి బాండింగ్ ఏర్పడింది. గతంలో జయప్రదతో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె తారక్‌ను యమదొంగ కి ముందు ఎన్టీఆర్, యమదొంగ తర్వాత ఎన్టీఆర్ ని కంపేర్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది.. అని ప్రశ్నించింది. దీనిపై తారక్ ఫన్నీగా స్పందించాడు. ఆయన మా అన్నయ్య.. నేను తమ్ముడిని అంటూ చెప్పుకొచ్చాడు. ఇక గతంలో అలీతో జరిగిన సంఘటనను చెప్పుకొస్తూ.. యమదొంగ షూటింగ్ జరుగుతున్న క్రమంలో అలీ అన్న ఇప్పుడు ఎలా ఉన్నాను అని అడిగా ఆయన నాపై కౌంటర్ వేశాడంటూ వివ‌రించాడు.

ఇంతకుముందు హరికృష్ణ గారికి తండ్రిలా ఉండేవాడివి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌కు కొడుకులా ఉన్నావు అంటూ వివరించాడు. దాంతో చాలా నువ్వు వచ్చేసిందంటూ చెప్పుకొచ్చాడు. అయితే కొంతసేపటికి ఏంటన్నా నేను ఇంతకు ముందు అంత చండాలంగా ఉన్నానా.. హరికృష్ణ గారికి తండ్రిలా ఉన్నాను అన్నావు.. పోనీలే హరికృష్ణ తండ్రి అంటే రామారావు గారేగా.. ఆయనతో పోల్చినందుకు చాలా హ్యాపీ అంటూ సింపుల్ గా రిప్లై ఇచ్చానని చెప్పుకొచ్చాడు. ఇక యమదొంగ కోసం తారక్‌ ఒక్కసారిగా బరువు తగ్గి అందరికి షాక్ ఇచ్చాడు. ఈ సినిమాలో తారక్ పై వచ్చిన విమర్శలు అన్నింటికి ఒక్క దెబ్బతో తిప్పి కొట్టాడు. యమదొంగ తర్వాత ఎన్టీఆర్ ఎప్పుడు ఫిట్నెస్ కోల్పోకుండా అదే ఫిజిక్ ను మైంటైన్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక చివరిగా ఆర్‌ఆర్ఆర్ సినిమాతో అదరగొట్టిన తారక్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.