ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆ హీరోను వివాహం చేసుకోనున్న దాదా మూవీ బ్యూటీ.. ?!

టాలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి నటించిన బీస్ట్ మూవీ తో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ అపర్ణ దాస్. ఈ సినిమాలో రాజకీయ నాయకుడు కూతురుగా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. గత సంవత్సరం తమిళ్‌లో రిలీజ్ అయిన మరో సూపర్ హిట్ మూవీ దాదాతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇకపోతే కొద్ది రోజుల్లో ఈవిడ పెళ్లి పీటలు ఎక్కడానికి సిదంధం అవుతుంద‌ట‌. ఇంతకీ ఈమె చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరో చెప్పలేదు కదా.. మంజు మెయిల్ బాయ్స్ హీరోల్లో ఒకరిగా నటించిన దీపక్ పరంబోల్. ఆయనను అపర్ణ దాస్ త్వరలోనే వివాహం చేసుకోనుంది.

మంజూమెయిల్ బాయ్స్ సినిమాలో సుదీప్ పాత్రలో దీపక్ నటించిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే వీరిద్దరూ పెద్దల అంగీకారంతో త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నారట. కేరళలో ఏప్రిల్ 24 న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగులోను అపర్ణ దాస్ ఓ సినిమాలు నటించింది. మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా తెరకెక్కిన ఆదికేశవ సినిమాలో అప‌ర్ణ కీ రోల్‌లో మెప్పించింది.

అయితే ఈ సినిమాల్లో అపర్ణ దాస్ టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చినా.. సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో ఈమెకు ఇక్కడ అంతగా గుర్తింపు రాలేదు. మలయాళం లో మనోహరం సినిమాతో హీరోయిన్గా తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న అపర్ణ.. ఈ సినిమా ద్వారా విమర్శకులతో ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత ప్రియాన్ ఒట్టతిల్లాన్, సీక్రెట్ హోం లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.