పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసిందోచ్.. ఏం ప్రోమో రా బాబు గూస్ బంప్స్ తెప్పిస్తుంది గా..!

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ తర్కెక్కిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తుండగా రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ తో అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పర్చిన పుష్పా 2 నుండి పుష్ప పుష్ప అనే సాంగ్ ప్రోమో ని రేపు సాయంత్రం 4 గం.5 ని లకు రిలీజ్ చేయనన్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా తెలిపారు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆగస్టు15 న గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ ముందుకి రానుంది. మరి ఈ క్రేజీ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.