మహేష్ – రాజమౌళి మూవీలో కీలక పాత్రలో నటించనున్న ఆ స్టార్ హీరోయిన్..?!

టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరో, హీరోయిన్లుగా తమ కంటు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకొని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు చేయబోయే సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాని రాజమౌళి ఎప్పుడు సట్స్ పైకి తీసుకువస్తారా అని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక రాజమౌళి మహేష్ బాబు హీరోగా ఒక అడ్వెంచర్స్ జానర్‌ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ కూడా కీలక పాత్రలో నటిస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Watch Yuvaraju Full Movie Online for Free in HD Quality | Download Now

అయితే గతంలో మహేష్ బాబు, సిమ్రాన్ కంబోలో యువరాజు సినిమా రిలీజ్ అయినా ఊహించిన‌ రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. కాగా ఈ క్ర‌మంలో రాజమౌళి డైరెక్షన్‌లో సిమ్రాన్ కు అవకాశం వచ్చిందంటే.. ఆమె పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుందో అనే ఆస‌క్తి ప్రేక్షకుల్లో మొదలైంది. మొత్తానికి మహేష్ బాబు ఒకప్పటి హీరోయిన్ అయినా సిమ్రాన్ తో మళ్ళీ ఈ సినిమాలో కలిసి మరోసారి నటించబోతున్నాడట. అప్పుడు చేసిన సినిమా ఫ్లాప్ అయిన ఇప్పుడు చేయబోయే సినిమా భారీ బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ సాధించడమే కాదు బాక్స్ ఆఫీస్ రికార్డులు అన్నిటిని బద్దలు చేస్తుంది అంటూ అభిమానులు తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Mahesh Babu

మొత్తానికి ఈ సినిమాతో ఇటు మహేష్ బాబు, అటు రాజమౌళి ఇద్దరు పాన్ వరల్డ్ లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాల్లో మహేష్ స‌ర‌సన ఓ హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇక ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబోలో వస్తున్న పాన్ వరల్డ్ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.