టాలీవుడ్ స్టార్ హీరోల పై శ్రీ లీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వారి తెర వెనక కథలను వినిపించిన యంగ్ క్రేజీ బ్యూటీ..?!

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే వరుస ఆఫర్లను అందుకుంటు సెన్సేషనల్ బ్యూటీగా మారిన ఈ చిన్నది.. చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాల్లో కనిపించింది. ఈ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న శ్రీ లీల.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెట్టింది. అయితే శ్రీ‌లీల ఇటీవ‌ల‌ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ ప్రాజెక్టులో హీరోయిన్గా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా టాలీవుడ్ లోని స్టార్ హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఈమె మొదటిసారి టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడటంతో నెటింట ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ జనరేషన్ హీరోయిన్లలో శ్రీ లీలలా డ్యాన్స్ చేసేవాళ్లు చాలా తక్కువ మంది అనడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు శ్రీ లీలా డ్యాన్స్ చేసినట్లు చేయడం చాలా కష్టమని మన హీరోలు కూడా ఎన్నో సందర్భాల్లో వివరించారు. ఈ క్రమంలో తాజాగా శ్రీ లీల మాట్లాడుతూ నేను చేసే డ్యాన్స్ కంటే టాలీవుడ్ హీరోలు చేస్తున్న యాక్షన్ సీన్స్ మరీ కష్టమంటూ చెప్పుకొచ్చింది.

మన హీరోలు సినిమాల కోసం యాక్షన్ సీక్వెన్స్‌కి ఎంతో కష్టపడతారని.. తెరవ వెనక ఎంతో శ్రమ ఉంటుందని వివరించింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న సినిమాలు.. హాలీవుడ్ ఫిలిం సర్కిల్‌లో చర్చకు దారితీస్తున్నాయంటే.. మనవాళ్లు డైరెక్షన్, యాక్షన్, సీక్వెన్స్‌లు, సీజి విజువల్స్ ఎఫెక్ట్స్ లో ఉన్న క్రేజ్‌ అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే శ్రీ‌లీల‌ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలో కనిపించనుంది.