‘ రామాయణ్ ‘ లో యష్ ఫిక్స్.. నటుడుగానే కాదు.. మరో బాధ్యత కూడా..

భారతియ‌ పురాణమ‌ ఇతిహాస గాథలపై సినీ ఇండస్ట్రీ ప్రారంభించిన దగ్గర నుంచి సినిమాలు వస్తూనే ఉన్నాయి. వాటిని వరుసగా ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. కచ్చితంగా కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు ఆ సినిమాను ఏ రేంజ్ లో ఆదరిస్తారు అందరికీ తెలుసు. అయితే గతంలో ప్రభాస్ హీరోగా ఆదిపురుష్‌ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కానీ ఇది ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. ఇప్పుడు మరోసారి రామాయణాన్ని ఆధారంగా తీసుకొని సినిమా తెర‌కెక్కిస్తున్నారు. రామాయ‌ణ్‌ పేరుతో దీన్ని రూపొందించినట్లు టాక్. పాన్ ఇండియా సినిమాగా దీన్ని తీస్తున్నారు. పాన్ ఇండియా ఆర్టిస్ట్‌లు అంతా.. ఈ సినిమాలో నటించినున్నారు. నితీష్ తివారి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా గురించి ప్రేక్షకులకు అదిరిపోయే అప్డేట్ ఒకటి రివిల్ అయింది.

ఇందులో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, య‌ష్‌ నటిస్తున్నట్టు గతంలో వార్తలు వినిపించాయి. రాముడుగా రణ్‌బీర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ కనిపిస్తారని ప్రచారం జోరుగా సాగింది. అయితే వీటిపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. ఈ క్రమంలో తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ రిలీజ్ అయింది. రామాయణ్ సెట్స్‌ పైకి వచ్చేందుకు సిద్ధంగా ఉందని.. ఇందులో కోలీవుడ్ రాకింగ్‌ స్టార్ యష్ భాగమవుతున్నారంటూ ప్రకటన వెలువడింది. కాగా యష్ ఈ సినిమాలో నటుడిగానే కాక.. మరో కొత్త బాధ్యతను కూడా చేపడుతున్నారు. ఇందులో ఆయన రావణుడిగా కనిపించడమే కాదు.. నిర్మాతగాను వ్యవహరించనున్నారు. ఈ సినిమా ప్రొడక్షన్‌లో య‌ష్ భాగం కానున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ నమిత్ మల్హోత్రతో కలిసి య‌ష్‌ ఈ మూవీని రూపొందించనున్నాడు.

అందుకోసం ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ వారితో మాంస్టర్ మైండ్ క్రియేషన్స్ కూడా చేతులు కలుపుతున్నారు. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ డిఎల్ఈజి కూడా భాగం కానుంది. ఈ ప్రొడక్షన్ హౌస్ కూడా నమిత్ మల్హోత్రాదే. కాగా నితిష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి య‌ష్‌ మాట్లాడుతూ.. నాకు ఎప్పటినుండో ఉన్న ఓ కల.. మన భారతీయ సినిమాని ప్రపంచ వేదికగా చూపించాలని. నమిత్‌, నేను రామాయణం చేస్తే బాగుంటుందని ఎన్నోసార్లు భావించాం. కానీ అంత పెద్ద సబ్జెక్టు తీయాలంటే అది సాధర‌ణ‌ విషయం కాదు. బడ్జెట్ కూడా సరిపోదు.. అందుకే నేను కూడా నిర్మాణంలో ఓ భాగం కావాలనుకున్న. రామాయణానికి నా మనసులో ఓ గొప్ప స్థానం ఉంది.

అలాంటి సినిమా కోసం ఎంతైనా కష్టపడతా.. ప్రపంచ వేదికలో ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చేందుకు మేము శ్రమిస్తాం. నితీష్ తివారి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణం అనేది మన జీవితాలతో మూడు పడి ఉండే ఇతిహాస గాథ అని మనం నమ్ముతున్నాం. మనకి రామాయణం తెలుసు అందులో జ్ఞానం, భావజాలం ఇలా ఎన్నో లేయర్స్ గ్లోబల్ స్టేజ్ తెరపై చూపించాల‌ని మా ఆశ‌. ఈ అద్భుతమైన రామాయణాన్ని ప్రేక్షకులందరికీ చూపించాలి. అందులో ఉన్న ఎమోషన్స్, వాల్యూస్ ఇలా అన్ని ప్రతి జర్నీని రామాయణంతో ప్రపంచమంతా చూపించాలి అంటూ వివరించాడు. ప్రస్తుతం యష్ కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారడంతో రాబోతున్న రామాయణ్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.