పెళ్లికి ముందే గుడ్ న్యూస్ చెప్పిన జబర్దస్త్ వర్ష – ఇమ్ము.. షాక్ లో ఫ్యాన్స్..!!

బుల్లితెర బిగెస్ట్‌ కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన చాలామంది నటీనటులు ఈ కామెడీ షో ద్వారా పాపులారిటీ దక్కించుకొని భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. అయితే ఈ షోలో వర్షా, ఇమ్ము జంట కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పక్కా లవ్ ట్రాక్ నడుపుతూనే.. కామెడీ పండిస్తూ ఉంటారు. సీరియల్ నటిగా మొదట కెరీర్ మొదలుపెట్టిన వర్షా.. పలు సీరియల్స్ నటించినప్పటికీ.. ఆమెకు ఎలాంటి సక్సెస్ అందలేదు. దీంతో జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయింది.

సుధీర్, రష్మీ లవ్ ట్రాక్ ఫాలో అవుతూ.. లవ్ ట్రాక్ నడిపింది. జబర్దస్త్ కమెడియన్ ఇమ్మూతో క్లోజ్ గా ఉంటూ.. అతడు కాంబినేషన్ లో స్కిట్స్ చేసింది. ఇమ్ము నాకు దొరికిన అదృష్టం.. ఎవరేమనా అతడిని నేను వదలను అంటూ ఓపెన్ గా కామెంట్స్ చేస్తూ ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ వ‌ర్కౌట్ చేసింది. ఇది ఆడియన్స్ లో బాగా క్లిక్ అయింది. ఇలా జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. వీరు ఈ షో ద్వారా రెండుసార్లు ఉత్తుత్తి పెళ్లి కూడా చేసుకున్నారు. ఇలా వీరిద్దరూ నిజమైన లవర్స్ అని బుల్లితెర ఆడియన్స్ మెప్పించేలా తమ న‌ట‌న‌తో ఆకట్టుకున్నారు.

ఇలాంటి క్రమంలో వీరిద్దరూ కలిసి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. పెళ్లి కాకుండానే గుడ్ న్యూస్ ఏంటంటూ మిగతా జబర్దస్త్ కమెడియన్స్ అంతా షాక్ అయ్యారు. రాకింగ్ రాకేష్ వద్దకు వెళ్లిన వర్ష, ఇమ్ము అన్న మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అంటూ కామెంట్స్ చేశారు. పెళ్లయిన ఇంకా మేమే గుడ్ న్యూస్ చెప్పలేదు.. మీరు అప్పుడే గుడ్ న్యూస్ చెప్తారా అంటూ రాకేష్ షాక్ అయ్యాడు. దీనిపై వారు స్పందిస్తూ మీరు అనుకున్న గుడ్ న్యూస్ కాదన్నా.. మేమిద్దరం టీం లీడర్స్ అయ్యాం అంటూ వివరించారు. దీంతో రాకింగ్ రాకేష్ తో పాటు అందరూ రిలాక్స్ అయ్యారు. ప్రస్తుతం వర్ష, ఇమ్ముకు టీం లీడర్ రావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.