హైదరాబాద్ లో రకుల్ ప్రీత్ నయా బిజినెస్ షురూ.. ప్లాన్ అదర్స్ అంటున్న ఫ్యాన్స్..?!

చాలామంది నటిన‌టులు ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలో రాణిస్తూ దూసుకుపోతున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే బిజినెస్‌లో అడుగు పెట్టి సక్సెస్ అందుకుంటున్నారు. ఇలా ఇప్పటికే చాలామంది టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు పబ్‌లు, మల్టీప్లెక్స్ లు, జిమ్, రెస్టారెంట్ ఇలా ఎన్నో బిజినెస్ లో అడుగుపెట్టి సక్సెస్ సాధించరు. అలాంటి వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకటి.

ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ గతంలో చరణ్, బన్నీలాంటి స్టార్ హీరోల‌తో సినిమాల్లో నటించింది. ఇక ఫిట్నెస్ కు ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చే ఈ బ్యూటీ గతంలో హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఎఫ్ 45 పేరుతో జిమ్ సెంటర్ బ్రాంచ్‌లుగా ఓపెన్ చేసింది. టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ కూడా ఈ జీమ్స్‌లో వర్కౌట్లు చేస్తూ ఉంటారు. ఇదే కాకా వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్‌నెస్ న్యూట్రిషన్ బ్రాంచ్‌ల‌లో కూడా రకుల్ ప్రీత్ పెట్టుబడులు పెడుతూ రాణిస్తుంది.

హెల్త్ అండ్ స్కిన్ రంగాల్లో కూడా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. 2019లో న్యూ బుక్ పేరుతో బయోడిక్రేటబుల్ డైపర్ లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు మరో రంగంలోకి అడుగు పెట్టింది ఈ అమ్మడు. ఆరంభం పేరుతో హైదరాబాద్‌లో ఓ రెస్టారెంట్ త్వరలోనే ప్రారంభించనుంది. ఇందులో మిల్లెట్స్ తో తయారు చేసిన హెల్తీ ఫుడ్ తన కస్టమర్లకు అందించబోతుంది. ఇటీవల పెళ్లి చేసుకున్న‌ రకుల్ ఇప్పుడు కొత్తగా బిజినెస్ మొద‌లు పెట్టడం.. అది కూడా ఇలాంటి హెల్తీ బిజినెస్ రంగాన్ని ఎంచుకోవడంతో అంతా ఆమె బిజినెస్ ప్లాన్ కు ఫిదా అవుతున్నారు.