వాట్.. ఈ హోమ్ మేడ్ షాంపుతో ఇన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టొచ్చ.. అసలు మిస్ కావద్దు..!!

ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్ లో చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఆభ‌ర‌పు అలవాట్లు కారణంగా కూడా జుట్టు తరచుగా రాలిపోతూ ఉంటుంది. రోజు హెయిర్ ఫాల్‌తో కురులు పల్చగా మారుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యకు ఈ హోం మేడ్ షాంపూ తో ఈజీగా చెక్ పెట్టవచ్చు. ఇది కచ్చితంగా వర్కౌట్ అవుతుంది. వారానికి రెండుసార్లు ఈ న్యాచుర‌ల్‌ షాంపూలు వాడడం ద్వారా హెయిర్ ఫాల్‌ మెల్లమెల్లగా కంట్రోల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ న్యాచురల్ షాంపూను సింపుల్ ప్రాసెస్ లో ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. మొదట మిక్సీ జార్ తీసుకొని.. అందులో ఒక క‌పు షీకాకాయి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత అదే మిక్సీ జార్ లో గింజ తీసేసిన కుంకుడు కాయలు ఒక కప్పు, ఎండు ఉసిరి మొక్కలు క‌ప్పు వేసి మిక్సీ పట్టాలి. తర్వాత ఒక కప్పు గింజలు కూడా మిక్సీ పట్టాలి. విడివిడిగా వీటన్నిటిని పొడి చేసి పెట్టుకున్న తరువాత.. స్టవ్ ఆన్ చేసి అందులో మూడు నుంచి నాలుగు గ్లాసుల వరకు వాటర్ తీసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న షీకాకాయ, కుంకుడు, ఉసిరిపోడులను వేసి 15 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత అవిస గింజల పొడి వేసి మరో ఐదు నిమిషాలు దీన్ని ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకొని చల్లార బెట్టుకుంటే మన షాంపూ రెడీ అయిపోతుంది.

ఈ షాంపూను ఒక బాటిల్లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఈ షాంపూ ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. వారానికి రెండుసార్లు ఈ హోమ్ మేడ్ షాంపూ జుట్టుకు వాడడం వల్ల క్రమంగా హెయిర్ ఫాల్ తగ్గుముఖం పడుతుంది. కుదుళ్ళు దృఢంగా మారి హెయిర్ ఎప్పుడూ నల్లగా నిగ‌నిగ‌లాడుతూ కనిపిస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ సమస్యకు న్యాచురల్ షాంపూలు చాలా సహకరిస్తాయని.. గుర్తుంచుకోండి. పైగా ఈ షాంపును వాడడం వల్ల డాండ్రఫ్ సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు. కొంతమందికి తరచూ తల దుర్వాసన వస్తూ ఉంటుంది ఈ సమస్యకు కూడా ఈ నేచురల్ షాంపుతో చెక్ పెట్టవచ్చు.