ఈ వ్యాధి ఉన్నవారు కోడిగుడ్లు తింటే అంత ప్రమాదమా.. కచ్చితంగా తెలుసుకోండి..?!

చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కోడి గుడ్డు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆమ్లెట్, ఉడక‌పెట్టిన గుడ్డు.. లేదా పచ్చి గుడ్డు ఇలా రకరకాలుగా కోడిగుడ్లు తీసుకుంటూ ఉంటారు. గుడ్డును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్‌కు దూరంగా ఉండవచ్చు.. హెల్తీగా ఉండవచ్చని చాలామంది భావిస్తారు. ఇక జిమ్‌కు వెళ్తూ.. డైట్లు వర్కౌట్ చేసేవాళ్లయితే కోడి గుడ్లు వరం లా ఫీల్ అవుతారు. ప్రతిరోజు ఒక గుడ్డు తినాలని నిపుణులు చెప్తూ ఉంటారు. ప్రోటీన్లు విటమిన్లు గనిగా కోడి గుడ్డును పరిగణిస్తారు. అలా రోజూ గుడ్డు తినే అలవాటు కూడా చాలామందిలో ఉంటుంది. అయితే కొన్ని వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు గుడ్డుకు దూరంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు.

అన్ని పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం అనగానే అందరికీ ఠ‌క్కన గుర్తుకు వచ్చేది గుడ్డే. ప్రోటీన్లు మాత్రమే కాదు విటమిన్లు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మినరల్స్, ప్రోటీన్స్‌ ఇలా అన్ని కోడిగుడ్డులో స‌మృద్ధిగా ఉంటాయి. అందుకే డైలీ ఎగ్ ప్ర‌తిఒక‌రు తినాల‌ని వైద్యులు చెబుతూ ఉంటారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వారిని కోడిగుడ్లు తినవద్దని వైద్యులే వివరిస్తున్నారు. అయితే ఈ వ్యాధులతో ఇబ్బంది పడేవారు కోడిగుడ్లు తినడం వల్ల వ్యాధి మరింత బలపడుతుందట. అధిక ఎల్డీఎల్, కొలెస్ట్రాల్, ఊబకాయం, అరుగుదల సమస్య, గుండె వ్యాధులు, డయాబెటిస్ ఇబ్బందులతో బాధపడుతున్న వారు కోడిగుడ్లు తినడం అసలు మంచిది కాదని.. అలాంటి అలవాటును వెంటనే మానుకోవడం మంచిదాన్ని నిపుణులు చెప్తున్నారు.

దీని వాడకం పూర్తిగా తగ్గించేయాలని ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న గుడ్లు అరుగుదలకు చాలా సహాక‌రింంచినా పచ్చ సొన్న తో కొలెస్ట్రాల్ సమస్యలు మరింతగా పెరుగుతాయట‌. గుండె కండరాల్లో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడే ఇబ్బంది ఉంటుంది. అందుకే ఈ అరుగుదల సమస్యలు, ఊబ‌కాయం, కొలెస్ట్రాల్ లాంటి ఇబ్బందులు ఉన్నవారు గుడ్డు తినక పోవడమే మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ప్రోటీన్లు, విటమిన్స్ లభించే ఆహార పదార్థాలు గుడ్డు కాకుండా చాలా ఉంటాయి. వాటిని సేవించడం వల్ల మీకు ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. అయితే గుడ్డు స్కిప్ చేసే ముందు ఒకసారి వైద్యుని సలహా తీసుకోండి.