చేసిన తప్పుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నా.. యాంకర్ సుమ షాకింగ్ వీడియో వైరల్.. ?!

యాంకర్ సుమ కనకాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. గత రెండు దశాబ్దాలుగా స్టార్ యాంకర్ గా ఆమె హవా నడుస్తుంది. మలయాళ అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు యాంకర్‌గా భారీ సక్సెస్ అందుకోవడమే గొప్ప విషయం. మొదట్లో ఆమె నటిగా ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా కూడా పనిచేసింది. అయితే ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో యాంకరింగ్ వైపు మొగ్గు చూపింది. ఈమెకు యాంకరింగ్ బాగా వర్కౌట్ అవ్వడంతో హిస్టరీ క్రియేట్ చేసింది అనడంలో సందేహం లేదు.

సమయస్ఫూర్తి, కామెడీ సీన్స్, మూడు.. నాలుగు భాషలపై పట్టు ఇందులో ఉండే ఎనర్జీ అన్ని ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. నటుడు రాజీవ్ కనకాలను ఆమె ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య సుమా బుల్లితెర షోలను తగ్గించడం.. ఇంటర్వ్యూలో సినిమా ఈవెంట్స్‌లో ఎక్కువగా కనిపించడం చూస్తూనే ఉన్నాం. యాంకర్‌కి కావాల్సిన ముఖ్య లక్షణాల్లో అందం కూడా ఒకటి. నాలుగు ప‌దుల వ‌య‌స్సులోను సుమ యంగ్‌గా కనిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ట్రెండీ బట్టల్లో సుమ ఫోటోషూట్స్ చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు తన అప్డేట్స్ షేర్ చేసుకునే సుమ.. తాజాగా ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసింది.

ఆ వీడియోలో ఆమె చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారాయి. ఉగాది పండుగ రోజు డైట్ పక్కన పెట్టేసి ఫుడ్‌ గట్టిగా లాగించేసానని.. నేను చేసిన తప్పుకు ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నా అంటూ వర్కౌట్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. ఉగాది నాడు పులిహోర, పొంగలి, గారెలు, పాయసం ఇలా అన్ని ఆహార పదార్థాలను గట్టిగా లాగించేసానని.. అవన్నీ కరిగించాలంటే ఈ వ్యాయామం తప్పదంటూ షేర్ చేసుకుంది. పండుగ తర్వాత ప్రాయశ్చిత్తమంటే ఇలానే ఉంటుంది అంటూ ట్యాగ్ జోడించింది. ఇక సుమ ఈ వీడియోకు కొంతమంది సపోర్ట్ చేస్తుంటే.. మరి కొంతమంది ఈ వయసులో నీకు ఈ డైట్లు, వర్కౌట్లు అవసరమా.. మీరు ముసలివారండి మీకు ఎందుకు ఇవన్నీ అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.