నేను ఇప్పటివరకు కలిసి వర్క్ చేసిన వాళ్లలో ఆమె ది బెస్ట్.. చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు.. మొత్తం సౌత్ ఇండస్ట్రీలోనే బెస్ట్ డ్యాన్సర్ లిస్ట్‌లో అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల పేర్లు మొదటి వరుసలో ఉంటాయి. వాళ్ళ‌ సరసన డ్యాన్స్ చేయడం అంటే అంత సులువు కాదని హీరోయిన్లు కూడా పలు సందర్భాల్లో చెబుతూ ఉంటారు. కానీ ఆ డ్యాన్సింగ్ ప్రాసెస్‌ను మాత్రం హీరోయిన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారట. ఇక‌ అప్పట్లో చిరంజీవికి మోస్ట్ ఫేవరెట్ డ్యాన్స్ ఫార్మేట్ అంటే వాణి విశ్వనాథ్, రాధ‌ల పేర్లు చెప్పేవారు.

Game Changer song Jaragandi: Ram Charan and Kiara Advani dance their hearts  out in foot-tapping track. Watch - Hindustan Times

ఆ తర్వాత వచ్చిన హీరోయిన్లలో హీరోలతో సమానమైన డ్యాన్స్ చేసింది మాత్రం తమన్నా, సమీరా రెడ్డిలు మాత్రమే.. అనే కామెంట్స్‌ వినిపించేవి. అయితే రామ్ చరణ్ మాత్రం గతంలో మాట్లాడుతూ ఇప్పటివరకు తాను వర్క్ చేసిన వారిలో ఆ స్టార్ హీరోయిన్ బెస్ట్ కోడ్యాన్స‌ర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. ప్రస్తుతం హీరోయిన్గా నటిస్తున్న కియారా అద్వానీ.

Jaragandi: Ram Charan, Kiara Advani dance it out in first Game Changer song  - India Today

ఇప్పటివరకు తాను వర్క్ చేసిన అందరిలో బెస్ట్ డ్యాన్స్ పార్ట్నర్ అంటే ఆమె అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు చ‌ర‌ణ్‌. భరత్ అనే నేను మూవీలో ఆమె డ్యాన్స్ ను పెద్దగా చూడలేకపోయా.. కానీ మేము ఇద్దరం కలిసి నటించిన వినయ విధేయ రామాలో కియారా పెర్ఫార్మెన్స్ అదరగొట్టింది అంటూ చరణ్ కామెంట్స్ చేశాడు. అయితే చరణ్ అప్పట్లో చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం చరణ్ గేమ్ చేంజర్‌ సినిమాలోకి కియారాతో కలిసి నటిస్తున్న క్రమంలో మరోసారి వైరల్ గా మారుతున్నాయి.