పూరీ జగన్నాధ్ సంచలన నిర్ణయం.. డైరెక్షన్ ఆపేసి ఆ పని చేయబోతున్నాడా..?

పూరి జగన్నాథ్.. ఇప్పుడు అంటే ఈ డైరెక్టర్ పేరు చెప్తే జనాలు పెద్దగా లైక్ చేయడం లేదు.. ఇంట్రెస్ట్ చూపించడం లేదు .. కానీ ఒకప్పుడు ఈ పేరు చెప్తే జనాలు ఏ రేంజ్ లో ఊగిపోయే వాళ్ళు థియేటర్స్ లో ఏ రేంజ్ లో అరుపులు వినిపించేటివి మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో బద్రి .. రవితేజ తో ఇడియట్ లాంటి సినిమాలు ఇప్పటికీ ఆయన ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉంటాయి .

పవన్ కళ్యాణ్ అదేవిధంగా రవితేజ స్టార్ హీరోలుగా మారడానికి కారణం పూరి జగన్నాథ్ అని చెప్పుకోక తప్పదు. రీసెంట్గా సోషల్ మీడియాలో పూరి జగన్నాథ్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది . పూరి జగన్నాథ్ టైమ్ ఈ మధ్యకాలంలో బాగోలేదు . అందుకే ఆయన ఏ సినిమా చేసిన ప్లాప్ అవుతుంది. మరి ముఖ్యంగా లైగర్ సినిమా ఆయనకు భారీ దెబ్బేసింది .

అయితే ఇలాంటి క్రమంలోనే పూరి జగన్నాథ్ ఇకపై సినిమాలను డైరెక్ట్ చేయకూడదు అంటూ డిసైడ్ అయ్యారట . ప్రజెంట్ డబుల్ ఇస్మార్ట్ షూట్లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా అయిపోగానే ఇక డైరెక్షన్ కి గుడ్ బై చెప్పేసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట . కుదిరితే ఆడ పదపా సినిమాలలో చిన్న క్యారెక్టర్స్ చేసుకుని లైఫ్ని ముందుకు తీసుకెళ్లాలి అంటూ డిసైడ్ అయ్యారట.

అయితే పూరి జగన్నాథ్ ఎంతో ఇష్టంగా రాసుకున్న జనగణమన మాత్రం తన కెరీర్ లో ఇక తెరకెక్కించేది లేదు అని డిసైడ్ అయిపోయినట్లు ఉన్నాడు ఈ డైరెక్టర్ అంటూ జనాలు వెటకారంగా ట్రోల్స్ చేస్తున్నారు. మనకు తెలిసిందే జనగణమనను మహేష్ బాబుతో తెరకెక్కించాల్సి ఉంది. కొన్ని కారణాల చేత అది ఆగిపోయింది . ఆ తర్వాత విజయ్ దేవరకొండ లైన్లోకి వచ్చాడు. లైగర్ ప్లాప్ అవ్వడంతో విజయ్ కూడా హ్యాండ్ ఇచ్చేశాడు..!!