రాజకీయాలు నీకు సెట్ కావు.. పవన్ కి కోన వెంకట్ సలహా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లోనే మంచి పేరుని సంపాదించుకున్నారు. ప్రముఖ రచయిత డైరెక్టర్ అలానే ప్రోడ్యూసర్ అయినట్లు వంటి కొన వెంకట్ తాజాగా పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ కి తాను సలహా ఇచ్చానని మడిచి దగ్గర పెట్టుకో అని అన్నారని షాక్ ఇచ్చారు. మరి కొన వెంకట్ ఇచ్చిన సలహా ఏంటి…? అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ అలా రియాక్ట్ అయ్యారు అనేది తెలుసుకుందాం.

గీతాంజలి మళ్లీ వచ్చింది రిలీజ్ కి రెడీ అవుతుంది. అంజలి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 11 న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కోన వెంకట్ పవన్ కళ్యాణ్ తనతో ప్రవర్తించిన తీరు గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం మనకు తెలుసు..రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ బిజెపితో కలిపి పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. అయితే కూటమితో కలిసి ఎలా అయినా ఎన్నికల్లో గెలవాలని ఉన్నారు.

సినిమా ఇండస్ట్రీలో ఒక వర్గం నుండి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ వస్తుంటే ఇంకో వర్గం నుండి మాత్రం విమర్మలు వస్తున్నాయి.తాజాగా పవన్ కళ్యాణ్ తో జరిగిన ఓ షాకింగ్ సంభాషణ గురించి చెప్పారు పవన్ కళ్యాణ్ కి సలహా ఇచ్చానని రాజకీయాలు నీకెందుకు అసలే నువ్వు ఇంట్రావర్డ్ పైగా సెన్సీటివ్ గా ఉంటావు అని పవన్ కళ్యాణ్ తో తాను అన్నానని అన్నారు. ఎవడు పడితే వాడు మాట్లాడుతున్నాడు ఇది నీకు అవసరమా అని అడిగానని, పవన్ కళ్యాణ్ ని బపినియన నీ మడిచి నీ దగ్గరే పెట్టుకో అన్నారని కోన వెంకట్ చెప్పారు. 2019 లో కూడా పవన్ పొలిటిక్స్ పై ఆయన చెప్పిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి.