టాలీవుడ్ లో కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో తెలుసా..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. చివరిగా రాజమౌళి డైరెక్షన్ వ‌చ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్ని ప్ర‌స్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ద‌క్కించుకుంటున్నాడు. కొంతకాలంగా ఎటువంటి సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై కనిపించకపోయినా.. ఆయనకు రోజురోజుకు అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప.. ఏమాత్రం తగ్గడం లేదు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే గతంలో టాలీవుడ్ నటులలో ఒకరైన మహేష్ విట్టా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

Mahesh Vitta gets evicted from Bigg Boss 3

ఆయన చేసిన కామెంట్స్ మరోసారి నెటింట‌ వైరల్ గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన మహేష్ విట్టా ఓ ఇంటర్వ్యూలో తారక్ గురించి మాట్లాడుతూ ఆయన అంటే నాకు చాలా ఇష్టం అని.. తారక్‌కు సంబంధించిన మాక్సిమం అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటా అంటూ వివరించాడు. తారక్ గురించి ఎవరేం చెప్పినా నేను వింటానని.. నైట్ ఎంత ఆలస్యమైనా తారక్‌ ఉదయం కరెక్ట్ టైం కు షూట్ కు వెళ్తాడని మహేష్ విట్టా వివరించారు. ఇక ఫుడ్ తినాలనిపిస్తే ఏ ఫుడ్ అయినా ఆయన తినేస్తారని చెప్పుకొచ్చాడు.

క్యారెక్టర్ కోసం మారాలంటే ఎంత కష్టమైనా అందులో ఒదిగిపోతారని.. తార‌క్‌కు మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అంటూ పేర్కొన్నాడు. తారక్ కొంతకాలం ఓల్డ్‌ సిటీలో ఉన్నారని.. ఆయన ఓల్డ్ సిటీ స్లాంగ్‌లో ఉర్ధు చాలా బాగా మాట్లాడుతారని.. టాలీవుడ్ లో ఉండే మరే స్టార్ హీరోలో ఆ టాలెంట్ ఉండదంటూ మహేష్ విట్టా చెప్పుకొచ్చాడు. అలాంటి పాత్రతో తారక్‌కు సినిమా స్టోరీ వస్తే కచ్చితంగా ఆ సినిమా ఊహించని రేంజ్ లో సక్సెస్ అవుతుందని.. మ‌హేష్‌ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు.

ప్రస్తుతం మహేష్ విట్టా చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ గా మారుతున్నాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం దేవర మొదటి పార్ట్ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక‌ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.