కెరీర్ విషయంలో పవన్ చేసిన ఆ తప్పునే సాయి ధరమ్ తేజ్ రిపీట్ చేస్తున్నాడా.. మ్యాటర్ ఏంటంటే..?!

టాలీవుడ్ లో పవర్ స్టార్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పవన్ కూడా కెరీర్ స్టార్టింగ్ లో సినిమాల విషయంలో ఎన్నో తప్పులు చేశాడని.. అదే తప్పులు ఇప్పుడు మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా చేస్తున్నాడు అంటు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ చేసిన ఆ తప్పేంటి.. సాయి ధరంతేజ్ ఏ విషయంలో పవన్ ను ఫాలో అవుతున్నాడు ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లో అన్ని ఒకే టైప్ స్టోరీస్‌ని ఎంచుకుంటూ సినిమాల్లో నటించేవాడు. దీంతో పవన్ సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. కానీ నటుడుగా వైవిద్యమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోలేకపోయాడు. దానివల్ల స్టార్ హీరోగా సక్సెస్ అవుతాడో.. లేదో.. అనే సందేహాలు మెగా అభిమానులు అందరిలో వ్యక్తమయ్యాయి.

Pawan Kalyan Birthday: As Actor Turns 48, Here are 5 of His Best Films -  News18

ఇక మొత్తానికైతే రాను రాను కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనను తాను డిఫరెంట్ గా రిప్రజెంట్ చేసుకుంటూ భారీ సక్సెస్‌లను అందుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి ధరంతేజ్ కూడా పవన్ కళ్యాణ్ బాటలోనే నడుస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈయన కూడా పవన్ లాగే ఒకే రకమైన కథలను ఎంచుకుంటూ వైవిద్యమైన పాత్రలకు దూరంగా ఉంటున్నాడు. రొటీన్ కథలతో సినిమాలు తీస్తున్నాడు. ఒక విరూపాక్ష సినిమాను మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు ఒకే ఫార్ములాతో వ‌చ్చాయ‌న‌డంలో సందేహంలేదు. దీంతో ఆయనకు ఊహించిన సక్సెస్ అందలేదు.

Sai Dharam Tej Net Worth 2024: Age, Movies, GF and Earnings

అయితే ఇప్పుడు మరికొన్ని సినిమాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తేజ్.. ఆయన తీసిన సినిమాలు సక్సెస్ సాధించాలంటే ఇప్పటికైనా వైవిధ్యమైన పాత్రలను, కథాంశాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. చివరిగా విరూపాక్ష సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకొవ‌డంతో తేజ్ నటించబోయే తర్వాత సినిమాలు పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దీన్నిబట్టి ఫ్యూచర్లో సాయి ధరంతేజ్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ విరూపాక్ష లాంటి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంటాడో.. లేదా అవే రొటీన్ కథ‌లని చేస్తూ డీల పడిపోతాడో వేచి చూడాలి. ఇక ఇటీవల తేజ్ హీరోగా నటిస్తున్న గంజా శంకర్ సినిమా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా మళ్లీ సెట్స్ పైకి రానుందట.