బాలయ్య తో కనిపిస్తున్న ఈ బుడ్డోళ్ళు ఇప్పుడు ఎలా మారిపోయారో చూడండి..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న వారిలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. బాలకృష్ణ సినిమాలో నటించే యాక్ట్రెస్ కి మంచి గుర్తింపు దక్కుతూ ఉంటుంది. అలా ఇప్పటికే ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు మరియు హీరోయిన్లు కనిపించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక ఎప్పుడు ఎవరు ఎంత గొప్పగా ఎదుగుతారో మాత్రం అస్సలు ఊహించలేమనే చెప్పాలి.

చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన వారు కాస్త వయసు రాగానే సూపర్ స్టార్ లు అవుతుంటారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, తరుణ్, అఖిల్ ఇలా వీరందరూ చైల్డ్ ఆర్టిస్టులుగా మెప్పించిన వారే. అదేవిధంగా మీనా, రాసి,హన్సిక, షాలిని, లయ వంటి వారు చైల్డ్ ఆర్టిస్టులు గ నటించి తరువాత హీరోయిన్లుగా సత్తా చాటుకున్నారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోయిన్ రాసి ఒకే సినిమాలో కలిసి నటించారు.

వీరిద్దరూ అన్నా, చెల్లెల్లుగా నటించారంటే ఆశ్చర్యపోక ఉండరు. ఆ రోజుల్లో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కోడి రామకృష్ణ కాంబినేషన్ అంటే మామూలు సూపర్ హిట్ కాంబినేషన్ కాదు. వీరిద్దరి కాంబోలో వరుసుగా 6 సినిమాలు 100 రోజులు ఆడిన చిత్రాలు ఉన్నాయి. అందులో బాలగోపాలుడు చిత్రం ఒకటి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నటి సుహాసిని హీరోయిన్గా నటించగా..ఈ సినిమాకు కళ్యాణ్ రామ్, రాసి ఇద్దరు కూడా బాల నటులుగా నటించారు.