మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ బాలయ్య సినిమాకు కాపీన.. ఇదే ప్రూఫ్‌..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కొర‌టాల శివ డైరెక్షన్‌లో గతంలో శ్రీమంతుడు సినిమా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందించడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. బాహుబలి సినిమాతో పాటు వచ్చి నాన్‌ బాహుబలి ఇండస్ట్రియల్ హిట్గా నిలిచింది. 1నేనొక్క‌డినే, ఆగడు లాంటి డిజాస్టర్ తర్వాత తెరకెక్కిన ఈ సినిమా ఒక్కసారిగా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వ‌చ్చిన ఈ సినిమాను చూసిన తర్వాత చాలామంది సెలబ్రిటీస్ తమ సొంత ఊళ్లను దత్తత తీసుకున్నారు.

Srimanthudu Movie Latest Posters

అయితే ఇంత పాపులారిటీ దక్కించుకున్న.. ఈ కథను బాలకృష్ణ గతంలోనే నటించారు. కళాతపస్వి కే.విశ్వనాధ్ డైరెక్షన్‌లో 1984 జూలై 27న జననీ జన్మభూమి సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల్లో అంతగా కనెక్ట్ కాలేదు. బాలకృష్ణ హీరో కాగా సుమలత హీరోయిన్గా నటించిన ఈ సినిమా కథ శ్రీమంతుడు సినిమాను పోలే ఉంటుంది. అయితే ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా రావ‌డంతో ఫ్లాప్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు.

జననీ జర్మభూమి ఫోటోలు | Janani Janmabhoomi Tollywood Movie Photos, Pictures,  Wallpapers - Filmibeat Telugu

జననీ జన్మభూమి మూవీలో వాల‌కృష్ణ‌.. సుమ‌ల‌త‌ను ప్రేమించి ఆమె సొంత ఊరు తెలుసుకొని ఆ ఊరికి వెళ్తాడు. అక్కడ సమస్యలు, దుర్మార్గ చేష్ట‌లు అన్నింటిని అరికడతాడు. అప్పుడు సక్సెస్ కానీ లైన్‌ని.. కమర్షియల్ ఎలిమెంట్స్ నుంచి కొరటాల శివ శ్రీమంతుడు సినిమాగా ఇప్పటి ప్రేక్షకుల అంచనాలకు అందేలా అద్భుతంగా తెర‌కెక్కించాడు. ఈ విషయాన్ని స్వయంగా కొరటాల శివ మాట్లాడుతూ అప్పటి ఈ అద్భుతమైన లైన్‌ని ఇప్పుడు జనానికి నా స్టైల్ లో గుర్తు చేయాలనిపించింది అంటూ వివరించాడు. ప్రస్తుతం బాలకృష్ణ నటించిన ఈ లైన్ ని శ్రీమంతుడు సినిమాగా తెర‌కెక్కించారని న్యూస్ వైరల్ అవ్వడంతో అంత షాక్ అవుతున్నారు.