మెగాస్టార్ సినిమాల్లో తారక్ ఫేవరెట్ మూవీ ఏంటో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..?!

టాలీవుడ్‌లో మెగా, నందమూరి ఫ్యామిలీలకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు కుటుంబాల నుంచి స్టార్ హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే చాలు ఫ్యాన్స్ లో ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి. ఇక మెగాస్టార్‌కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 150కి పైగా సినిమాల్లో నటించిన చిరంజీవి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అలాగే నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి అందరికీ తెలిసిందే. మాస్ ఆడియన్స్ లో భారీ పాపులాటి దక్కించుకున్నాడు తారక్.

Tarak Doesn't Talk About #RRR, Why?

ఈ నేపద్యంలో తారక్‌కు చిరంజీవి నటించిన అన్ని సినిమాల్లో ఒకే ఒక్క సినిమా చాలా ఫేవరెట్ అంటూ.. వార్త‌లు వినిపిస్తున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ స్వయంగా ఈ విషయాన్ని వివరించడం విశేషం. ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటివరకు చిరంజీవి నటించిన అన్ని సినిమాల్లో నా ఫేవరెట్ రుద్ర‌వీణ‌ సినిమా అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా తారక్‌కే కాదు ఇప్పుడు జనరేషన్ వాళ్లకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కే.బాలచందర్ డైరెక్షన్ లో క్లాసికల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోకపోయినా.. మెగా అభిమానులకు మాత్రం తెగ నచ్చేసింది.

Chiranjeevi's Rudraveena completes 25 years | Telugu Movie News - Times of  India

చిరంజీవికి జోడిగా శోభన హీరోయిన్గా నటించిన ఈ సినిమా చిరు కెరీర్‌లోనే ఎంతో స్పెషల్ సినిమాగా నిలిచిపోయింది. ఇక ప్రస్తుతం చిరంజీవి నటించిన ఫ్లాప్ సినిమా తారక్‌కు ఇష్టమని తెలియడంతో అభిమానులంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే చిరంజీవి నటించిన ఆ కథ నిజంగానే అద్భుతంగా ఉంటుందని.. భారీ సక్సెస్ ద‌క్క‌కపోయినా అభిమానుల ఆదరణ పొందుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చిరంజీవి, తారక్ ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లో వరుస అవకాశాలను అందుకుంటున్నాడు. ఇక చిరంజీవి ఇటీవల విశ్వంభ‌ర‌తో పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అందుకునేందుకు శ్రమిస్తున్నాడు.