ఈ ఎండకు విపరీతంగా చెమట పడుతుందా..? అయితే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి ..మీ ప్రాబ్లం సాల్వ్..!

వచ్చేసింది ..జనాలను భయపెట్టే ఎండాకాలం వచ్చేసింది ..ఎప్పటికంటే ఈసారి ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్నాయి. ఉదయం 10 గంటల దాటితే చాలు సూర్యుడు భగభగ మండిపోతున్నాడు . ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలి అంటే వణుకు పుట్టే పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి . అయితే ఎండలు భగభగ మండుతున్నాయి అని మన పనులను ఆపుకోలేము..

కొన్ని కొన్ని వృత్తుల్లో ఉండేవాళ్లు ఖచ్చితంగా ఎండకు బయట తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది . అయితే అలాంటి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అంటున్నారు డాక్టర్లు . అంతేకాదు ఈ ఎండాకాలం పెరిగిపోతున్న ఉష్ణోగ్రతకు తీవ్రంగా చెమటపడుతుంది . మరీ ముఖ్యంగా కొంతమందికి ఎక్కువగా చెమట పట్టే గుణం ఉంటుంది . అయితే అలాంటి వాళ్ళు ఎక్కువగా నీళ్లు తాగడం చాలా చాలా మంచిది అంటున్నారు డాక్టర్లు .

లేకపోతే బాడీ డిహైడ్రేట్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోవడం ..వడదెబ్బ తగలడం లాంటివి జరుగుతూ ఉంటాయట . మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు ..గర్భిణీ స్త్రీలు ..షుగర్ పేషెంట్స్ అదేవిధంగా 50 వయసు దాటిన వాళ్లు గంట గంటకి నీరు తాగుతూ ఉండడం మంచిది.. చెమట పోతూ ఉంటే చల్లనీళ్లతో ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండడం చాలా మంచిది అని చెప్తున్నారు డాక్టర్లు. చెమట పోస్తున్నప్పుడు చన్నీళ్ళతో మొహం కడిగితే చెమట కంట్రోల్ అవుతుంది అని కూడా సజెషన్స్ ఇస్తున్నారు..!!