ఎండాకాలం బయట తిరిగి వచ్చి అలాంటి పని చేస్తున్నారా..? ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్లే..జాగ్రత్త..!

చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. బయటనుంచి రాగానే చేతులు కాళ్లు శుభ్రం చేసుకోకుండా వెంటనే మంచినీరు తాగడం ..లేదంటే ఏదైనా ఫుడ్ స్నాక్స్ హ్యాండ్ వాష్ చేసుకోకుండా తినడం లాంటివి చేస్తూ ఉంటారు . అయితే మామూలు టైం లోనే అది మంచిది కాదు .. క్రిములు బ్యాక్టీరియా మన లోపలికి వెళ్లిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది . బయటనుంచి ఎక్కడెక్కడో తిరిగి వచ్చి చేతులు కాళ్లు శుభ్రం చేసుకోకుండా అలా ఫుడ్ తినడం మంచిది కాదు అంటున్నారు డాక్టర్లు.

మరీ ముఖ్యంగా ఈ ఎండాకాలంలో చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది . బయటనుంచి రాగానే దాహం అనిపిస్తుంది. అయితే చేతులు కాళ్లు శుభ్రం చేసుకోకుండానే ఆయాసం మీద వాటర్ తాగడం హార్ట్ కి మంచిది కాదు అని చెప్తున్నారు డాక్టర్లు . ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయాసం మీద నీళ్లు తాగకూడదు అంటూ సజెషన్స్ ఇస్తున్నారు . రెండు నిమిషాలు కూర్చొని విశ్రాంతి తీసుకున్నాక మన ఊపిరి తీసుకోవడం కరెక్ట్ గా కంట్రోల్లోకి వచ్చాక చేతులు కాళ్లు శుభ్రపరచుకొని అప్పుడు నీరు నెమ్మదిగా తాగడం శ్రేయసకరం అంటున్నారు .

ఈ ఎండాకాలంలో చాలా మంది బయటకు వెళ్లి చమటకు తట్టుకోలేక గబగబా వచ్చి ఫ్రిజ్ ను ఓపెన్ చేసేసి బాటిల్లో నీళ్లు కడగడా తాగిస్తూ ఉంటారు. అయితే మరి ముఖ్యంగా వయసు అయిపోతున్న వాళ్ళు అలా చేయడం చాలా చాలా ప్రమాదకరం అంటున్నారు. పూర్తిగా చేతులు కాళ్లు శుభ్రం చేసుకున్నాక కనీసం ఒక్క నిమిషం పాటు కూర్చొని విశ్రాంతి తీసుకున్నాక ఆయాసం తగ్గాక మంచినీళ్లు సేవించడం మంచిది అంటూ నిప్పుణులు చెప్పుకొస్తున్నారు..!!