బ్లాస్టింగ్ ధరకు అమ్ముడుపోయిన పుష్ప 2 నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్.. రికార్డ్ సృష్టించిన బన్నీ మూవీ..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 ది రూల్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే ఆకాశమంత క్రేజ్ ఏర్పడింది. తెలుగుతోపాటు పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎప్పటినుంచో నిరీక్షిస్తున్నారు. 2021 లో వచ్చిన పుష్ప ది రైజ్ దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ దక్కించుకోవడమే కాదు.. బాక్స్ ఆఫీస్ వ‌ద్ద‌ భారీ కలెక్షన్లను కలగొట్టింది. ముఖ్యంగా తెలుగులో కంటే హిందీలోనూ, ఉత్తర భారత్ లో ఈ సినిమా మరింత సక్సెస్ అందుకుంది.

Pushpa 2 The Rule teaser: It's Allu Arjun's world and we are just living in  it as Pushpa Raj returns, this time as Goddess Kali | Telugu News - The  Indian Express

అల్లు అర్జున్ యాక్షన్, మేనరిజం, స్వాగ్‌ బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో ఈ మూవీ సీక్వెల్ పుష్ప 2పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో మూవీ నార్త్ ఇండియా థియేటర్ రైట్స్ కళ్ళు చెదిరే ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. నార్త్ థియేటర్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తందానీకి చెందిన ఏ ఏ ఫిలిమ్స్ దక్కించుకుంది. దాదాపు రూ.200 కోట్లు వెచ్చించి మరీ ఈ సినిమా రైట్స్ సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు నార్త్ ఇండియాలో అత్యంత పెద్ద డీల్ వచ్చిన సినిమా ఇదే కావడం విశేషం.

Rashmika Mandanna Sports Sindoor As She Returns As Srivalli in Allu Arjun's  Pushpa 2; FIRST Look Out - News18

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ షారుక్‌ నటించిన జవాన్ నార్త్ ఇండియన్ హక్కులు కూడా రూ.150 కోట్లకు అమ్ముడుపోయాయి. అయితే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2కి ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్ పెట్టడంతో బన్నీ పుష్ప సినిమాతో ఫ్రీ రిలీజ్ బిజినెస్ లోనే కొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. అయితే ఇప్పుడు నార్త్ ఇండియాలో రూ.400 కోట్ల నెట్ కలెక్షన్ పుష్ప 2 సినిమా రాబడితేనే బయ్యర్లు సేఫ్ అవుతారు. అయితే ఈ మూవీకి ఉత్తరాదిలో ఉన్న క్రేజ్ రీత్యా సులభంగా ఈ వసూళ్లు కొల్లగొడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక సినిమా రిలీజై పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద మరోసారి పుష్ప గాడు రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం.