అఫిషియల్: మన టిల్లు గాడి కోసం ఎన్టీఆర్‌ వచ్చేస్తున్నాడ్రోయ్.. ఇక రచ్చ రంబోలానే..!!

టిల్లు స్క్వేర్ .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు .. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ హీరోగా మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన సినిమా . ఈ చిత్రానికి మల్లిక్ రాం దర్శకత్వం వహించారు . గతంలో తెరకెక్కిన డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన స్టిల్లు స్క్వేర్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది .

నాగవంశీ – సాయి సౌజన్య ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు . గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా 96.6 కోట్ల సాధించింది అంటేనే సినిమా ఎంత బాగా హిట్ అయింది అనే విషయం అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా సిద్దు గాడి డైలాగులు ..ఎక్స్ప్రెషన్స్ ..బాడీ లాంగ్వేజ్ సినిమాని మరో మెట్టు ఎక్కించాయి. సినిమాకి కర్త – కర్మ – క్రియ అంతా కూడా సిద్దు జొన్నలగడ్డ అని చెప్పక తప్పదు .

అనుపమ అందాలు అనుపమ బోల్డ్ పర్ఫామెన్స్ సినిమాకి మరింత ప్లస్ గా మారాయి. సినిమా రిలీజ్ అయిన 8 రోజుల్లోనే 96.6 కోట్లు గ్రాస్ సాధించడం అనేది మామూలు విషయం కాదు . ఇది దాదాపు 45 కోట్లు షేర్ సాధించింది అని చెప్పాలి . సినిమా బిజినెస్ లెక్కలు 25 కోట్లు దాటేసాయి . ఇప్పటికే బయర్లకి లాభాలు పంట నడుస్తుంది . ఇంకా లాంగ్ రన్ ఈ మూవీకి ఉండడం విశేషం .

కాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం ఏప్రిల్ 8న సోమవారం గ్రాండ్ గా ఓ ఈవెంట్ ను ప్లాన్ చేశారు మేకర్స్. ఇదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది మూవీ టీం. అంతే కాదు ఈవెంట్ కి ఎన్టీఆర్ ని చీఫ్ గెస్ట్ గా తీసుకోరాబోతున్నారట. ఇటీవల సినిమా హిట్ అయినందుకు ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే . ఇప్పుడు టిల్లు సక్సెస్ అయిన సందర్భంగా ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తూ ఉండడం నందమూరి అభిమానులకు బాగా హ్యాపీనెస్ ఇస్తుంది..!